ఎర్ర బెండకాయలకు అనువైన నేల ,సాగులో మెళుకువలు..

-

సాదారణంగా బెండకాయలు రెండు రంగులలో ఉంటాయిన్న సంగతి తెలిసిందే..ముదురు ఆకుపచ్చ రంగు, లేత ఆకుపచ్చ రంగు.వీటిని మనం నిత్యం చూస్తూ ఉంటాము.అయితే ఎరుపు రంగు బెండకాయలు కూడా ఉంటాయని నిపుణులు అంటున్నారు.. ఆ కాయలు కూడా రుచికి చాలా బాగుంటాయని అంటూన్నారు.ఆ కాయలు మన నేలలో పండుతాయా?ఎటువంటి నేల కావాలి..సాగు చేసే పద్దతులు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాము..

ఆ బెండలను ఓ రైతు పండించి అందరి మన్ననలు అందుకున్నారు. ఏ రకమైన నేలలోనైనా దిగుబడి సాధ్యమవుతుంది కొంతకాలం క్రితం రైతు మిశ్రిలాల్ రాజ్‌పుత్ బనారస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ సెంటర్‌కు వెళ్లాడు. ఈ బెండకాయలను ఎంచుకొని ఛాలెంజి తీసుకోని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించాడు..అతని వ్యవసాయ ఇన్‌స్టిట్యూట్ నుండి ఒక కేజీ రెడ్ లేడీఫింగర్ విత్తనాలను రూ.2400కు కొనుగోలు చేశాడు.వాటిని ఎకరం పొలానికి వేశాడు. ఈ చెట్లకు ఒక్కో వాటికి 50 నుంచి 60 కాయలు కాస్తున్నాయి.

రెడ్ లేడీఫింగర్ గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ మరియు మధుమేహం ఉన్న రోగులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.ఈ కాయల చాలా ధర కూడా ఉంటాయి.3 నుండి 4 రెట్లు ఎక్కువ. రెడ్ లేడీఫింగర్ విక్రయించడం ద్వారా రైతులు కిలోకు రూ.300 నుంచి 400 వరకు సంపాదించవచ్చు. ఈ రెడ్ లేడీఫింగర్ పంటకు నష్టం జరిగే అవకాశం కూడా తక్కువ..ఈ బెండ రంగు ఎరుపు కారణంగా ఎక్కువ పురుగులు కూడా ఆకర్షించవు..ఈ పంటను వేసుకోవాలి అనుకుంటే వ్యసాయ శాఖ అధికారులను సంప్రదించి వేసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news