అలసంద పంటలో కలుపు నివారణ,నీటి యాజమాన్యం..

-

మన రాష్ట్రంలో పండిస్తున్న పంటలలో ఒకటి అలసంద.. ఈ పంట లో కలుపు ఎక్కువగా ఉంటుంది. కలుపును తీయడం, అలాగే నీటి యాజమాన్యం గురించి సరైన అవగాహన లేకపొతే పంట నష్టం జరుగుతుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు..వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అలసందలు ఎక్కువగా వేడిమితో కూడిన వాతావరణంలో 20-30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు కల్గి వుండినచో బాగా పండుతాయి..అధిక చలిని, వర్షాలను ఈ పంట తట్టుకోలేదు.

అనుకూలమైన నేలలు..

అలనందలు వివిధ నేలలలో పండుతాయి.కానీ, తేమను పట్టి ఉండె గుణము కలిగి మురుగు నీరు నిల్వని మధ్యస్థ, చల్కా నేలలు, ఎర్ర భూములు మరియు నల్లరేగడి భూములు అనుకూలంగా ఉంటాయి.

విత్తు వెయ్యడానికి సమయం..

అలసందలు వర్షాధారంగా ఖరీఫ్లో, మిగులు తేమ ఆధారంగా లేట్ ఖరీఫ్, నీటి పారుదల క్రింద రబీలో మరియు వేసవిలో కూడా పండిస్తారు. ఖరీఫ్ జూలై; ఖరీఫ్లో లో ఆలస్యంగా విత్తినప్పుడు సెప్టెంబర్, రబీలో నీటిపారుదల క్రింద అక్టోబర్-నవంబర్ లో విత్తుకోవచ్చు.విత్తనం లేదా పచ్చికాయ కోత కోసం విత్తినప్పుడు 8-10 కిలోలు, పశుగ్రాసం లేదా, పచ్చిరొట్టకై విత్తినప్పుడు 12-14 కిలోల విత్తనం ఉపయోగించాలి.. విత్తనాలను విత్తిన 25-30 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి, అవసరాన్ని బట్టి సాళ్ళ మధ్య నాగలి తో కలుపు నివారించాలి. మొక్కల మధ్య కలుపును కూలీలు పెట్టి తీయాంచాలి..

కలుపు నివారణ..

పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు. 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని లేదా మరుసటి రోజు గాని పిచికారి చెయ్యడం మేలు..

నీటి యాజమాన్యం..

ఖరీఫ్ లో సాధారణంగా వర్షాధారంగా వండిస్తారు, తర్వాత మిగులు తేమ ఆధారంగా పండిస్తారు. రబీలో నీటి పారుదల క్రింద కీలక దశలో 3-4 తడులిచ్చి పండించవచ్చు. బెట్టను బాగా తట్టుకునే పంట అయినప్పటికీ దాదాపుగా 250-300 పెట్టించి మి.మీ, నీరు అవసరముంటుంది. మొగ్గ, పిందె, కాయ దశలలో నీరు అందించాలి. తప్పనిసరి పరిస్థితులలో బెట్ట పరిస్థితులు నెలకొన్నచో 2 శాతం యూరియా లేదా 2% డి.ఎ.పి కలిపి పిచికారి చేయడం వల్ల పుచ్చు లేకుండా కాయ సైజు బాగుంటుంది.. ఈ పంట గురించి ఇంకా ఏదైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వ్యవసాయ నిపునులను సంప్రదించగలరు..

Read more RELATED
Recommended to you

Latest news