ఆ పరికరంతో..మొక్కలు తమకు నీరు కావాలంటే అడుగుతాయ్..!

-

మనుషులైతే.. తినాలనిపిస్తేనో, ఆకలేస్తేనో తింటారు. కానీ మనం ఇంట్లో పెంచే కుక్కలు, మొక్కలాంటివి అలా కాదు.. నోరు లేనివి.. మనకి మూడ్ వచ్చి పెట్టినప్పుడే అవి తింటాయి. మొక్కలకు కూడా అంతే.. టైం ఉన్నప్పుడు అలా వాటర్ పోసేస్తాం.. ఎప్పుడైనా ఆలోచించారా.. ఇప్పుడు మొక్క నీళ్లు కావాలనుకుంటుందా… దానికి అసలు ఇప్పుడు తాగాలని లేదోమో అని, మొక్కలకు మాటలు వస్తే.. నాకు నీళ్లు కావాలని అని చెప్తే.. భలే ఉంటుంది కదా.. టెక్నాలజీ సాయంతో.. మొక్కలు నీళ్లు ఎప్పుడు కావాలో మనకు సంకేతం ఇస్తాయి. ఏంటి ఇంకా అర్థంకాలేదా.. అయితే మొత్తం చదివేయండి..!

మొక్కలకు నీరు ఏ సమయంలో కావాలనే విషయం తెలుసుకునే పరికరం ఇప్పుడు వచ్చేసింది. శాస్త్రవేత్తలు మొక్కల కోసం ఒక ప్రత్యేకమైన స్మార్ట్ వాచ్‌ను క్రియేట్ చేశారు. ఇది ఆకులకు నీరు ఏయే సమయాల్లో కావాలనే విషయాన్ని చెప్తుంది. బ్రెజిల్‌లోని బ్రెజిలియన్ నానోటెక్నాలజీ నేషనల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేశారు.

ఈ స్మార్ట్‌వాచ్ మొక్కలలో నీటి మట్టం ఎంత ఉందో గుర్తిస్తుంది. అంతర్గతంగా ఎంత తేమ అవసరమో కూడా తెలుసుకోవచ్చు. మొక్కలోని నీటి స్థాయిని గుర్తించేందుకు ఆకులకు సెన్సార్‌ని అమర్చారు. ఈ సెన్సార్ దానిలోని తేమ స్థాయిని తనిఖీ చేస్తుంది. ఈ సెన్సార్‌కి ఒక యాప్ లింక్ చేయబడింది. ఈ యాప్ యూజర్ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.. సెన్సార్ నీటి కొరతను గుర్తించినప్పుడల్లా, ఆ సమాచారాన్ని వినియోగదారు యాప్‌కు అందిస్తుంది. ఆ తర్వాత మొక్కలకు నీళ్లు పోయవచ్చు. ఇదంతా వైర్‌లెస్‌గా జరిగిపోతుందని.. డైలీ మెయిల్ నివేదికలో పేర్కొన్నారు.

గతంలోనూ ప్రయత్నం..

గతంలో కూడా ఇలాంటి సెన్సార్‌ను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. అయితే ఎలక్ట్రోడ్ ఆకులపై సరిగ్గా పని చేయకపోవడంతో అది సాధ్యం కాలేదు. ఫలితంగా దాని ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అందుకే బ్రెజిలియన్ నేషనల్ లాబొరేటరీ ఆఫ్ నానోటెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఆకులకు అతికించి సుదీర్ఘకాలం పాటు పర్యవేక్షించగలిగే ఎలక్ట్రోడ్‌లను అబివృద్ది చేశారు. దీని కోసం శాస్త్రవేత్తలు రెండు రకాల ఎలక్ట్రోడ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

మొక్కలో ఎంత నీరు ఉందనేది పర్సంటేజీ రూపంలో కనిపిస్తుంది. ఎలా అయితే ఫోన్ లో ఎంత చార్జిగ్ ఉందో మనం చూసుకున్నట్లు.. ఈ సమాచారంతో మొక్కలు పురుగుమందుతో ఏ మేరకు పోరాడుతున్నాయి, అందులో ఎన్ని విషపూరిత అంశాలు ఉన్నాయో కూడా తేలుస్తుందట.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news