కళ్ల కింద నల్లటి వలయాలా..?కారణాలు ఏమైనా ఈ చిట్కాలు ట్రై చేయండి

-

అనేక కారణాల వల్ల కళ్ల చుట్టూ నల్లటి మచ్చలు ఏర్పడతాయి. నిద్రలేమి, ఒత్తిడి, డీహైడ్రేషన్, కంప్యూటర్, టీవీ, మొబైల్ ఫోన్‌లను ఎక్కువసేపు వాడడం వల్ల, కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. అలాగే ఐబ్రోస్‌ చేయించినప్పుడు కూడా కళ్ల దగ్గర చాలా నల్లగా ఉంటుంది. కొన్ని హోమ్‌ రెమడీస్‌ ద్వారా

వీటిని తొలగించుకోవచ్చు. అవేంటంటే

కళ్ల కింద నల్లటి వలయాలను పోగొట్టుకోవడానికి కొన్ని మార్గాలు ఏంటో చూద్దాం

  • దోసకాయ ముక్కలు లేదా తురుము మరియు కనురెప్పల మీద పది నిమిషాల పాటు ఉంచండి. దీన్ని రోజుకు రెండు మూడు సార్లు రిపీట్ చేయండి. ఇది కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తొలగించడంలో సహాయపడుతుంది.
  • బంగాళదుంపలను ముక్కలుగా లేదా తురిమిన తర్వాత కనురెప్పల మీద  ఉంచి.. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

 

  • టీ బ్యాగ్ ఉపయోగించడం వల్ల కళ్ల చుట్టూ ఉన్న నల్లటి మచ్చలు తొలగిపోతాయి. ఇందుకోసం టీ బ్యాగ్‌ని పది నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలు తొలగిపోతాయి.
  • కళ్ల చుట్టూ ఉన్న డార్క్ కలర్‌ని తగ్గించడానికి కాఫీ ప్యాక్ సహాయపడుతుంది. ఇందుకోసం రెండు టీస్పూన్ల కాఫీ పౌడర్‌లో ఒక టీస్పూన్ కొబ్బరినూనె వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
  • కళ్ల కింద నల్లటి వలయాలను పోగొట్టేందుకు అలోవెరా జెల్‌ను అప్లై చేయడం కూడా మంచిది.
  • కళ్ల కింద పదే పదే స్కిన్‌ డార్క్‌ అయితే..అది మీ అందాన్ని చెడగొడుతుంది. చూడ్డానికి గోస్ట్‌లాగా, వయసులో పెద్దోళ్లులా కనిపిస్తారు. మీరు చేసే చిన్న చిన్న తప్పులే ఈ సమస్యకు కారణం అవుతాయి. కాబట్టి లైట్స్ ఆఫ్‌ చేసి ఫోన్స్‌ వాడటం మానేయండి, పని ఏం లేకపోయినా.. రాత్రుళ్లు అనవసరంగా ఫోన్ చూస్తూ టైమ్‌ వేస్ట్‌ చేయకండి.. కంటి నిండా నిద్రపోతే ముఖంలో గ్లోయింగ్‌ ఆటోమెటిక్‌గా వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version