బిజినెస్ ఐడియా: కొబ్బరి చిప్పలతో అదిరే లాభాలు..!

-

మీరు ఏదైనా మంచి వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా..? దాని ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా ఈ బిజినెస్ ఐడియా ని కనుక మీరు ఫాలో అయ్యారంటే మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. చాలా మంది బిజినెస్ కంటే కూడా వ్యాపారాలు చేయడానికి ఇష్టపడుతున్నారు.

 

ఒక వ్యక్తి ఏకంగా కొబ్బరి చిప్పల వ్యాపారాన్ని మొదలు పెట్టి మంచిగా ఇప్పుడు సంపాదించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం పట్టణానికి చెందిన ప్రసాద్ ఈ వ్యాపారం మొదలు పెట్టి చక్కగా లాభాలను పొందుతున్నారు. కరోనా సమయంలో ఇబ్బందులు రావడం వల్ల తన వృత్తిని మానుకుని ఈ బిజినెస్ ని మొదలు పెట్టారు.

కొబ్బరి టెంకల వినియోగం గురించి అతను తెలుసుకున్నారు. ఎండుకొబ్బరి చిప్పలు కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కొబ్బరి చిప్పలను సేకరించేందుకు ఆలయా కమిటీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. పచ్చి చిప్పలను ఎండబెట్టి తక్కువ వేడి సెగ తగిలించి వీటిని తయారు చేస్తున్నారు.

ఈ కుటీర పరిశ్రమని ఇంట్లోనే ప్రారంభించారు. ఎండుకొబ్బరిని కేరళ, ఆంధ్ర లోని కొబ్బరి పరిశ్రమలకి అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకుని సరఫరా చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలా వ్యాపారంతో లక్షల్లో లాభాలను పొందుతున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది అన్న దానికి ఉదాహరణగా నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news