బండి సంజయ్ తెలంగాణ వ్యక్తేనా…DNA టెస్ట్ చేసుకోవాలి : పొన్నం ప్రభాకర్

-

బండి సంజయ్ తెలంగాణ వ్యక్తేనా…DNA టెస్ట్ చేసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఉద్యమం లో బండి సంజయ్ పాల్గొన్న ఒక్క ఫోటో ఉన్నా చూపించాలని.. గతంలో మూడు రాష్ట్రాలను ఇచ్చి బీజేపీ తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు తీరుని విమర్శించిన ప్రధానికి మోడీకి సంజయ్ కి బుద్ధి చెప్పాలని డిమాండ్‌ చేశారు.

దేశ వ్యాప్తంగా ఈడీ ,సిబిఐ దాడులు చేస్తుంటే ..తెలంగాణ లో మాత్రం చేయడం లేదు ..ఇది లాలూజి కాదంటారా అని ప్రశ్నించారు. తెలంగాణ వ్యాప్తంగా రైస్ మిల్స్ లో దాడులు చేస్తున్నారని… దొంగలు ఎవరో కూడా తేల్చాలి ..అంతే కానీ మీ రాజకీయ అవసరాలకు చేయకండని ఫైర్‌ అయ్యారు. రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ గ్రామా గ్రామానికి తీసుకెళతామని… ఓటమి గెలుపు రాజకీయ నాయకులకు కామన్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కి ఎందుకు మాకు అనుమతి ఇవ్వలేదు..రాహుల్ టూర్ పై కేసియర్ కుటుంబం భయపడిందని విమర్శించారు పొన్నం ప్రభాకర్.

Read more RELATED
Recommended to you

Latest news