బిజినెస్ ఐడియా: మొక్కల పెంపకంతో రెట్టింపు లాభాలు..!

-

చాలా మందికి మొక్కల్ని పండించడం అంటే ఎంతో ఇష్టం. ఖాళీ సమయంలో ముక్కల్ని వేసి వాటిని చూసుకుంటూ ఉంటారు. అయితే దానిని మీరు బిజినెస్ కింద మార్చుకోవచ్చు. మీకు మొక్కలు అంటే బాగా ఇష్టం అయితే ఈ బిజినెస్ ఐడియాని మీరు అనుసరించవచ్చు. దీనితో మంచిగా డబ్బులు కూడా మీకు వస్తాయి.

 

bussiness ideas

మొక్కలు అంటే చాలా మందికి ఇష్టం. అయితే మీరు మంచిగా మొక్కల్ని పెంచి క్యాష్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు కూడా. రోజుకు మూడు నుండి నాలుగు గంటల సమయాన్ని వెచ్చిస్తే సరిపోతుంది. పైగా మీరు పెట్టుబడి పెట్టిన దాని కంటే రెట్టింపు డబ్బులు మీకు వస్తాయి.

ఈ మధ్య కాలంలో చాలా మంది మొక్కలని ఇంట్లో పెట్టుకుంటున్నారు. అందంగా ఇల్లు కనపడడానికి ఇండోర్ ప్లాంట్స్ మొదలైనవి కొనుగోలు చేస్తున్నారు. మీరు వెయ్యి రూపాయల నుంచి కూడా ఈ వ్యాపారం మొదలు పెట్టొచ్చు.

కుండి తో సహా మీరు మొక్కలు అమ్మచ్చు. ప్లాస్టిక్ కుండీకి అయితే 20 రూపాయలు వరకు అమ్మచ్చు. అదే సిరామిక్ అయితే 50 రూపాయల వరకు అమ్మవచ్చు. కుండీలు చూడగానే ఆకట్టుకునేలా ఉంటే ఎక్కువమంది మీ పనికి ఎట్రాక్ట్ అయ్యి కొనుగోలు చేస్తారు. మొక్క తో సహా మీరు మంచిగా డెకరేషన్ చేసిన కుండీని వంద రూపాయల వరకు కూడా అవ్వచ్చు.

జేడ్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్, స్పైడర్, డ్రాగన్ వంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వీటిని కుండీల్లో వేసిన మూడు రోజులకే చిగురులు వచ్చేస్తాయి చిగురు వస్తే అందంగా మొక్క పెరిగినట్టే కదా. ఇలా ఈ విధంగా మీరు మొక్కలతో వ్యాపారం చేసుకోవచ్చు. ఈ మొక్కలకు ఎక్కువ నీళ్లు కూడా అక్కర్లేదు. చక్కగా మీరు పార్ట్ టైం కింద కూడా ఈ వ్యాపారంని చేసుకొని మంచిగా సంపాదించుకోవచ్చు. ఇలా అదే లాభాలు మీకు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news