బిజినెస్ ఐడియా: ప్రభుత్వం అందించే రూ. 4 లక్షల సహాయంతో అప్పడాల వ్యాపారం..!

-

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాపారాన్ని చేయడానికి చూస్తున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారం కోసం చూస్తున్నారా..? అయితే కచ్చితంగా ఈ ఐడియా ని చూడండి. ఈ ఐడియా ని అనుసరించడం వలన మంచిగా లాభాలు వస్తాయి పైగా రిస్క్ కూడా ఉండదు.

అదే అప్పడాల బిజినెస్. అప్పడాల బిజినెస్ ద్వారా మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. పైగా ఈ మధ్య కాలంలో అప్పడాలని తయారు చేసుకోవడానికి చాలా మంది బద్దకిస్తున్నారు. షాపులలో ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి కొనుగోలు చేసి ఫ్రై చేసేసుకుంటున్నారు. దీనిని ప్రారంభించి మీరు మంచిగ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎక్కువ పెట్టుబడి కూడా అక్కర్లేదు ప్రభుత్వం నుండి మీకు తప్పకుండా ఆర్థిక సహాయం వస్తుంది. గ్రామాల్లో నివసించే వాళ్ళకైనా పట్టణాల్లో నివసించే వారికైనా ఈ వ్యాపారం బాగుంటుంది. తక్కువ స్థలంలో మీరు ఈ బిజినెస్ ని చేయొచ్చు.

ఈ ఖర్చులు అవుతాయి:

సిబ్బందికి జీతం, ముడిసరుకు,యుటిలిటీ ఉత్పత్తుల ఖర్చు అవుతుంది. అలానే రెండు మిషన్లు కావాలి. అద్దె, కరెంటు, నీరు, టెలిఫోన్ బిల్లులు ఇవన్నీ కూడ కావలి.

ప్రభుత్వం నుంచి సాయం:

ఈ వ్యాపారం కోసం ప్రభుత్వం తక్కువ ధరకే రుణాలు ఇస్తోంది. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (NSIC) ఒక ప్రాజెక్ట్‌ను కూడా చేసింది. ముద్ర స్కీమ్ ద్వారా తక్కువ ధరకే నాలుగు లక్షల లోన్ వస్తుంది. ఇలా మీరు మీ బిజినెస్ ని స్టార్ట్ చేసేయచ్చు.

ఖర్చు ఎంత..?

ఈ బిజినెస్ కి 30వేల కిలోల ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్‌ ని స్టార్ట్ చేయడానికి మీకు 6 లక్షల రూపాయల పెట్టుబడి కావలి. ఎలానో నాలుగు లక్షలు వస్తాయి కనుక ఇంకో రూ.2 లక్షల వరకు మీరు పెట్టుకుంటే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news