బిజినెస్‌ ఐడియా: రూ. 50 వేలు ఉంటే ఈ వ్యాపారం చేయొచ్చు.. ఇప్పుడిదే నయా ట్రెండ్..!

-

ఈ మధ్య చిరువ్యాపారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. మన దగ్గర పదివేలు ఉన్నా ఏదో ఒక చిన్న బిజినెస్ స్టాట్‌ చేసేయొచ్చు. చిన్న ఆలోచనలు, చిన్న మొత్తంలో డబ్బు చాలు..రంగంలోకి దిగొచ్చు.. అయితే ఏం వ్యాపారం చేయాలి, చేస్తే ఎంత లాభం వస్తుంది. ఖర్చు ఎంత అవుతుంది అనే కామన్‌ కాలుక్యులేషన్స్‌ ఉంటే చాలు..మీ దగ్గర రూ. 50 వేలు ఉంటే ఓ సారి ఈ బిజినెస్‌ ఐడియా వైపు చూడండి.!

పూర్వకాలంలో ఇళ్లలో కుండలను బాగా ఉపయోగించేవారు. ఏ వంటకం అయినా మట్టి పాత్రల్లోనే చేసేవారు. అయితే కాలం మారడంతో.. పాష్‌ లుక్‌తో వంటపాత్రలు వంటిట్లోకి వచ్చాయి.. ఎప్పుడైతే అల్యూమినియం, స్టీలు, ప్లాస్టిక్‌తో చేసిన పాత్రలను ప్రజలు ఎక్కువగా వాడటం మొదలుపెట్టారో అప్పటి నుంచి రోగాలు కూడా పెరగడం మొదలయ్యాయని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు ప్రజల్లో పర్యావరణం, ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో మరోసారి కుండల వైపు చూసే వారి సంఖ్య పెరిగింది. కుండల తయారీ, అమ్మకం ఇప్పుడు మంచి వ్యాపారంగా మారింది.

అన్ని రకాల మట్టి పాత్రల తయారీ ప్రారంభమైంది. ఇందులో వంట నుంచి మొదలుకుని వడ్డించే వరకు పాత్రలు ఉన్నాయి. వాస్తవానికి కుండల తయారీ కుమ్మరి వారి పని. ఇప్పుడు అన్ని కులాల వారు ఆ కళను నేర్చుకున్నారు. చేస్తున్నారు కూడా..! ఇళ్లలో ఉపయోగించే అన్ని రకాల మట్టి పాత్రలను తయారు చేయడంతో పాటు మార్కెటింగ్‌కు వివిధ పద్ధతులను అవలంభించడం ప్రారంభించారు. మీరు కూడా మట్టి పాత్రల తయారీ, అమ్మకానికి సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు పాత్రల తయారీలో నైపుణ్యం కలిగిన కళాకారులను నియమించుకోవాల్సి ఉంటుంది.

పేరుకు మట్టిపాత్రలే అయినా..కాస్త అందంగా ఇంకాస్త క్రియేటివ్‌గా చేయగలిగే కళాకారులను నియమించుకుంటే.. ఇప్పుడున్న జనాలకు బాగా నచ్చుతుంది. కుండల తయారీకి మంచి మట్టితో పాటు వాటిని బట్టీల్లో కాల్చడానికి బొగ్గు/కలప కూడా అవసరం ఉంటుంది. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేస్తే మీ వ్యాపారం బాగుంటుంది. ప్రజల అవసరాలు ఏమిటో మీకు తెలిసినప్పుడే మీరు కుండల నుంచి బాగా సంపాదించగలరు. మట్టి చిప్పలు, గాజులు, కుక్కర్లు, వంట చేయడానికి, వడ్డించడానికి డిజైన్ పాత్రలు, నీటిని ఉంచడానికి స్టాండ్లు కూడా మార్కెట్‌లో అమ్ముడవుతున్నాయి. కాబట్టి మీరు వాటిని కూడా నిర్మించాలి.

పెట్టుబడి:

మీరు రూ. 50,000 పెట్టుబడితో కుండల తయారీ పనిని ప్రారంభించవచ్చు. ఇందులో చేతి వృత్తిదారుల జీతం, మట్టి తీసుకురావడానికి అయ్యే ఖర్చు, వంట పాత్రలకు వినియోగించే మూలధనం ఉంటాయి. అయితే, మీరు పెద్ద ఎత్తున పని చేయాలనుకుంటే, పెట్టుబడి పరిమితి లేదు. ఇప్పుడు మట్టి కుండలు కూడా యంత్రాల ద్వారా తయారు చేస్తున్నారు. వాటిని తయారు చేయడానికి ఆధునిక బట్టీలను కూడా ఉపయోగిస్తున్నారు. మీరు కుండల తయారీ నుంచి ఎంత సంపాధిస్తారనేది మీ పాత్రల నాణ్యత, మార్కెటింగ్‌పై ఆధారపడి ఉంటుంది.

ప్రారంభంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఒక అంచనా ప్రకారం.. మొదట్లో కుండల తయారీ వ్యాపారం ద్వారా నెలకు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు లాభం పొందవచ్చు. మీ ఉత్పత్తి అమ్మకాలు మరింత పెరిగేకొద్దీ, మీ లాభాలు కూడా పెరుగుతాయి. ఐడియా బాగుంది అనుకుంటే..మీరున్న ఏరియా వనరులు చూసుకుని దిగొచ్చు. నష్టం అయితే రాదు..కాకపోతే మన బిజినెస్‌ను బాగా మార్కెటింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
Attachments area

Read more RELATED
Recommended to you

Latest news