హాట్‌ సమ్మర్‌లో కూల్‌ బిజినెస్..పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ..!!

-

సీజన్‌ను బట్టి వ్యాపారం చేస్తే.. మంచి లాభం ఉంటుంది. చాలామందికి ఏదో ఒక బిజినెస్‌ చేయాలని ఉంటుంది కానీ.. ఏది చేస్తే లాభం ఉంటుందో పెద్దగా ఐడియా ఉండదు..అలాంటి వారికోసమే.. మేం బిజినెస్‌ ఐడియాస్‌ ఇస్తున్నాం.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే వ్యాపార ఉపాయాలు ఈ సైట్‌లో ఇప్పటికే చాలా ఉన్నాయి.. ఇప్పుడు అలాంటి ఓ ఐడియాతో వచ్చాం..వచ్చేది ఎండాకాలం.. ఈ సమ్మర్‌లో మంచి గిరాకీ ఉండే వ్యాపారాలలో ఒకటి ఐస్‌క్రీమ్‌ పార్లర్..దీనికి పెట్టుబడి తక్కువ. పైగా లాభం ఎక్కువ..
వ్యాపారం పెరిగే కొద్దీ ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ ఈ వ్యాపారం విపరీతంగా సాగుతోంది. ఈ వ్యాపారాన్ని ఎక్కడైనా ప్రారంభించే అవకాశం ఉంది. మీరు 300-400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐస్ క్రీమ్ పార్లర్‌ను ప్రారంభింవచవచ్చు. ఇందులో 5-10 మందికి సీటింగ్ ఏర్పాటు చేస్తే చాలు…ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) నివేదిక ప్రకారం.. దేశంలో ఐస్ క్రీం వ్యాపారం ఈ ఏడాది చివరి నాటికి $1 బిలియన్ దాటుతుందని చెబుతుంది. సమ్మర్‌లో చాలామంది..ఐస్‌క్రీమ్స్‌ తినడానికే ఎక్కువ ఇష్టపడతారు.
ఐస్ క్రీమ్ పార్లర్ కోసం.. మీరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నుండి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.. ఇది 15 అంకెల రిజిస్ట్రేషన్ నంబర్. మీ స్థలంలో తయారు చేసిన ఆహార పదార్థాలు దాని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ఇది నిర్ధారిస్తుంది. మీరు అమూల్ ఐస్ క్రీమ్ పార్లర్‌ను ఫ్రాంఛైజింగ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇందుకోసం కనీసం 300 చదరపు అడుగుల స్థలం కావాలి. ఐస్ క్రీం వ్యాపారంలో లాభాలు మీరు తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలను ఉపయోగిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే మీ దగ్గర డబ్బు కొంచెం ఎక్కువగా ఉంటే..పార్లర్‌లో చేసే ప్రొడెక్ట్స్‌తో పాటు..పార్లర్‌ డిజైన్‌ మీద కూడా ఫోకస్‌ చేయండి. ఎందుకంటే.. ఈరోజుల్లో చాలామంది..తినే తిండి కంటే.. వెళ్లిన ప్లేస్‌ మీదే ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నారు. ఫోటోస్‌ బాగా రావాలి, రీల్స్‌ బాగా చేయాలి..సో మీ పార్లర్‌ డిజైన్‌ యువతను యట్రాక్ట్‌ చేసేలా ఉంటే.. ఇంకా ప్లస్‌ అవుతుంది.!

Read more RELATED
Recommended to you

Latest news