మెగాస్టార్ చిరంజీవికి సీఎం కేసీఆర్ పరామర్శ

-

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ చిరంజీవికి ఫోన్ చేశారు. కరోనాతో బాధపడుతున్న చిరంజీవిని పరామర్శించారు. ఇంట్లో వాళ్ల ఆరోగ్యం గురంచి కూడా కేసీఆర్ వాకబు చేశారు. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు వారధిగా ఉన్న చిరంజీవి పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించాలని సీఎం ను కోరారు. ఇందుకు తగినట్లుగానే చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇండస్ట్రీ ఆకాంక్ష మేరకు ఇటీవల తెలంగాణలో టికెట్లు పెంచడంతో పాటు బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో పలువురు స్టార్లు వరసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, త్రిష, కీర్తి సురేష్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కరోన బారిన పడ్డారు. వీరంతా కోలుకున్నారు. కాగా ఇటీవల మెగాస్టార్ రెండో సారి కరోనా బారిన పడ్డారు. మరో హీరో శ్రీకాంత్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news