స్టార్ హీరోల సినిమాలకు టీజర్ వ్యూస్ కౌంట్ తో పాటుగా బుల్లితెర మీద ఆ సినిమా తీసుకొచ్చే టి.ఆర్.పి రేటింగుల గురించి కూడా హంగమా చేస్తారు. స్మాల్ స్క్రీన్ పై కూడా స్టార్ హీరోలు తమ హవా కొనసాగిస్తున్నారు. పండుగ వచ్చింది అంటే రిలీజ్ అయ్యే సినిమాల వైపు కొందరు చూస్తే.. టివిల్లో వచ్చే సినిమాల మీద అందరి కన్ను ఉంటుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జీ తెలుగులో అరవింద సమేత టెలికాస్ట్ అయ్యింది.
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమ అరవింద సమేత. ఆ సినిమా బాక్సాఫీస్ ఫైట్ లో విన్నర్ గా నిలిచింది కాని స్మాల్ స్క్రీన్ పై మాత్రం ఫెయిల్ అయ్యింది. ఎన్.టి.ఆర్ యావరేజ్ సినిమాలకు బుల్లితెర మీద మంచి డిమాండ్ ఉండేది. బాహుబలి తర్వాత ఎన్.టి.ఆర్ టెంపర్ సినిమాకే అత్యధిక టి.ఆర్.పి రేటింగ్ వచ్చింది. అలాంటిది ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమాకు మాత్రం కేవలం 13.7 టి.ఆర్.పి రేటింగ్ రాబట్టుకుంది.
రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు 19.5, 14.6 రేటింగ్స్ తెచ్చుకున్నాయి. వాటితో సమానంగా బాక్సాఫీస్ పై వసూళ్ల హంగామా చేసిన అరవింద సమేత మాత్రం టి.ఆర్.పి రేటింగులో వెనుకపడ్డది.