ఎన్నో అంచానాల మధ్య రిలీజ్ అయిన ‘ ఆచార్య ’ సినిమా డిజాస్టర్ లిస్ట్ లో చేరింది. సైరా సినిమా తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం కావడంతో పాటు రామ్ చరణ్ కీలక పాత్ర పోషించడం వరస విజయాలతో ఊపు మీదున్న కొరటాల శివ దర్శకత్వం వహించడంతో ఆచార్య సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇందుకు తగ్గట్లుగానే మణిశర్మ మ్యూజిక్, ట్రైలర్లు ప్రేక్షకుల అంచనాలను పెంచాయి. అయితే అనుకున్నంత స్థాయిలో ఆచార్య అలరించలేకపోయింది. మరో సన్నాఫ్ ఇండియాగా నిలిచిందంటూ నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఆల్ టైం డిజాస్టర్ జాబితాలో ఆచార్య నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడింది. ఫస్ట్ వీక్ లో ఈ సినిమా రూ. 47.87కోట్ల షేర్, రూ. 75.05 కోట్ల గ్రాస్ రాబట్టింది. మరో రూ. 84.63 కోట్లను రాబడితే కానీ బ్రేక్ ఈవెన్ దాటడం కష్టమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా రూ. 80 కోట్లకు పైగా నష్టాలు తెచ్చే అవకాశం ఉందన్నారు. బాక్సాఫీస్ దగ్గర ఆచార్య ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచిందన్నారు.