వ్యవసాయ శాఖ పై ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈనెల 11వ తేదీన మత్స్యకార భరోసా ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. చేపల సంరక్షణ కోసం ఎప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో చేపల వేట ప్రభుత్వం నిషేధిస్తోంది. ఈ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఏటా ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకం కింద… పదివేల రూపాయలు అకౌంట్ లో వేస్తోంది.
దీనితో పాటు అదనంగా డీజిల్ సబ్సిడీని ఏపీ ప్రభుత్వం మత్యకారులకు అందిస్తోంది. అలాగే… జూన్ 15లోపు పంట నష్ట పరిహారం పంపిణీ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రకటన చేశారు. మే 16 న వైఎస్ ఆర్ రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. జూన్ 3 వేల ట్రాక్టర్లు సహా 4014 వ్యవసాయ పరికరాలు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారని గుర్తు చేశారు కాకాణీ.