కూతురు భవిష్యత్తు కోసం పాటు పడుతున్న యాక్షన్ కింగ్ అర్జున్.. ఏకంగా ఆ హీరోతో..!!

యాక్షన్ కింగ్ అర్జున్ తన కూతురి భవిష్యత్తు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే..ఇదిలా ఉండగా టాలీవుడ్ యంగ్ హీరో బాగా పాపులర్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ తో తన కూతురి భవిష్యత్తు ను మార్చడానికి సిద్ధమవుతున్నాడు.ఇక విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈయన టీవీ9 తో గొడవ, రోడ్ పై ఫ్రాంక్ వీడియో లు ఇలా అన్నీ కూడా బాగా వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇకపోతే వివాదం తర్వాత విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి.ప్రస్తుతం మరొకసారి విశ్వక్ సేన్ పేరు బాగా వైరల్ గా మారింది.Vishwak Sen files defamation case on TV9 anchor | 123telugu.com

అది ఏమిటంటే తన నెక్స్ట్ సినిమా విషయంలో బాగా వైరల్ గా మారుతున్నాడు. అదేమిటంటే యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో అది కూడా ఆయన కుమార్తె హీరోయిన్ గా ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లు టాలీవుడ్ లో గత కొన్ని రోజుల నుంచి ప్రచారం బాగా జరుగుతోంది.ఇప్పటివరకు అటు అర్జున్ నుంచి కానీ ఇటు టాలీవుడ్ నుంచి కానీ ఏమాత్రం అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. కానీ యాక్షన్ కింగ్ అర్జున్ విశ్వక్ సేన్ కోసం ఒక మంచి వినూత్న పాత్రతో కథను సిద్ధం చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ కథను విశ్వక్ సేన్ వినిపించగా అతడికి బాగా నచ్చినట్లు తప్పకుండా చేద్దామని చెప్పినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అందర్నీ ఆశ్చర్య పరిచే మరొక విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా అర్జున్ కుమార్తె కూడా నటించబోతున్నట్లు సమాచారం.Actor Arjun Sarja's daughter Aishwarya tests positive for COVID-19

తమిళ్, కన్నడ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా మంచి సినిమాలు చేసి గుర్తింపు కోసం తెగ ఆతృతగా ఎదురు చూస్తోంది ఈ ముద్దుగుమ్మ . అందుకే తన కుమార్తెను టాలీవుడ్ కి పరిచయం చేయడానికి అర్జున్ స్వయంగా కథను సిద్ధం చేసినట్లు సమాచారం. అది కూడా ఇటీవల బాగా పాపులర్ చెందిన విశ్వక్ సేన్ తో తన కుమార్తె అదృష్టాన్ని మార్చడానికి సిద్ధమయ్యారు అర్జున్. ఈ విషయంపై ఎవరు ఎలా క్లారిటీ ఇస్తారో ఇంకా తెలియాల్సి ఉంది.