భావోద్వేగాల సమాహారంగా అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’ ట్రైలర్..

-

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం ‘రక్షా బంధన్’. సక్సెస్ ఫుల్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రక్షాబంధన్’ ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి చిత్రంలో చాలా చక్కగా వివరించినట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్ లో చెల్లెళ్ల కోసం అన్న పడే కష్టాలు గురించి స్పష్టంగా తెలిపారు. నలుగురు చెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం ఆర్థికంగా వెనుకబడిన ఓ అన్నయ్య పడే కష్టాలను ఎమోషనల్ గా సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.

భావోద్వేగాల సమాహారంగా సినిమా ఉండబోతున్నదని, ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్ కుమార్ కు జోడీగా భూమి పెడ్నేకర్ నటించింది. ఈ సినిమాను ఆనంద్ ఎల్.రాయ్, హిమాన్షు శర్మ ప్రొడ్యూస్ చేశారు. హిమేశ్ రేష్మియా మ్యూజిక్ డైరెక్టర్.

Read more RELATED
Recommended to you

Latest news