ఆలీ “యమలీల” కి 26 ఏళ్ళు …!

-

కమెడియన్ ఆలీ జీవితం మొత్తంలో ఎంతో మధురానుభూతిగా మిగిలే చిత్రం యమలీల. అప్పటికి కమెడియన్ గా మంచి పాపులరాఇటీని సంపాదించుకున్న ఆలీ కి ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, కె. అచ్చిరెడ్డి, కిషోర్ రాఠీ పిలిచి నిన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలనుకుంటున్నాము అని చెప్పగానే ఆలీకి నోట మాట రాలేదట. పైగా సరదాగా కామెడీ చేస్తున్నారనుకున్నాడట ఆలీ. అయితే ఆ తర్వాత అడ్వాన్స్ చేతికిస్తూ నువ్వే హీరో అని కన్‌ఫర్మ్ చేశారు. ఇక ఆలీ మొదటిసారి సోషియోఫాంటసీ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. మథర్ సెంటిమెంట్ కి సోషియోఫాంటసీ ని యాడ్ చేసి తెరకెక్కించిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

 

Mahesh Babu Missed, Ali Lucky

అంతేకాదు అప్పటి వరకు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించగా కె. అచ్చిరెడ్డి నిర్మించిన ఏ సినిమా కి ఈ సినిమా రేంజ్ లో వసూళ్ళు రాలేదు. 1994 ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమాకి ఈరోజు తో విజయవంతంగా 26 సంవత్సరాలు పూర్తి కావడం విశేషం. చిన్న సినిమాగా నిర్మించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైంది. అయితే మొదటి షో నుండే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ రావడం తో హీరో ఆలీ అన్న విషయం కూడా ఆలోచించకుండా ఒక పెద్ద స్టార్ సినిమాకి తరలి వచ్చినట్టు వచ్చారు ప్రేక్షకులు. ముఖ్యంగా ఈ సినిమాలో యముడిగా నటించిన కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా నటించిన బ్రహ్మానందం అద్భుతంగా నటించారు.

 

TBT: 50 Tollywood Movies & Their Rare Paper Cuttings of 50 & 100 ...

సినిమాకి వీళ్ళిద్దరి పాత్రలు ఎంతో కీలకంగా ఉండి సినిమా హిట్ అవడం లో ప్రధానపాత్ర పోషించారు. మనీషా ఫిలిమ్స్ బ్యానర్ లో అచ్చిరెడ్డి నిర్మాతగా కిశోర్ రాఠీ సమర్పణలో రూపొందిన ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గెస్ట్ అప్పీరియన్స్ గా ఒక స్పెషల్ సాంగ్ చేయడం ప్రత్యేకం. ఇక ఈ సినిమా 200 రోజులు ప్రదర్శింపబడటం విశేషం. ఇదే సినిమాని విక్టరీ వెంకటేశ్ హీరోగా తకదీర్ వాలా పేరుతో హిందీలో రీమేక్ చేశారు. 1995 లో రిలీజైన ఈ సినిమా కూడా మంచి వసూళ్ళను సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news