పుష్ప 2 లో యాంకర్ అనసూయ..ఫోటో వైరల్

-

పుష్ప తో సుకుమార్ మరియు అల్లు అర్జున్ కాంబోలో మరో ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన విజయంతో సీక్వెల్ ను కూడా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా దాదాపుగా చివరి దశలో ఉంది.

అయితే సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు పుష్ప-2 నుంచి ఇప్పటికే బన్నీ మాస్ లుక్ విడుదలై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు పెంచింది. తాజాగా యాంకర్ అనసూయ మేకప్ వేసుకుంటున్న ఫోటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసి ‘పుష్ప ది రూల్’ అని హ్యష్ ట్యాగ్ ఇచ్చారు. దీంతో పుష్ప-2 లో కూడా అనసూయ కనిపించనున్నట్లు స్పష్టం అవుతోంది. పుష్పలో ఆమె ఎర్రచందనం విలన్ మంగళం సీనుగా నటించిన సునీల్ కు భార్యగా కనిపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version