ఇంట్లో సింక్ పగిలిందా.. మ్యాగీ నూడుల్స్‌తో రిపేర్ చేయండిలా.. వైరల్ వీడియో

సోషల్ మీడియా.. ఇక్కడ అంతా కొత్తే. అంతా వైరలే. ఏదైనా ఎవరైనా కొత్తగా ట్రై చేస్తే చాలు. అది ప్రపంచమంతా ఇట్టే తెలిసిపోతుంది. అదే సోషల్ మీడియా మహిమ. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే విషయం కూడా చాలా వింతైంది. ఎందుకంటే.. అలా ఎవరూ ఎప్పుడూ ఊహించి కూడా ఉండరు. ఊహించనివి జరిగితేనే కదా జీవితం అంటే.

అసలు మ్యాటర్‌లోకి వస్తే.. మీ ఇంట్లో ఉన్న సింక్ పగిలిందనుకోండి.. ఏం చేస్తారు. ఏం చేస్తాం.. ప్లంబర్‌ను పిలిచి రిపేర్ చేయిస్తాం అంటారా? కానీ.. ఈయన చూడండి.. టూ మినట్స్ నూడుల్స్ మ్యాగీతో సింక్‌ను తనకు తానే రిపేర్ చేసుకున్నాడు. మ్యాగీతో సింక్‌ను రిపేర్ చేయమేందని నోరు వెళ్లబెట్టకండి. ఈ వీడియో చూడండి.. మీకే అర్థమవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.