11 ఏళ్లు.. 3వేల ఎపిసోడ్స్.. స్టార్ మహిళతో సుమ సంచలన రికార్డ్..!

-

బుల్లితెర మీద షో ఏదైనా సరే సుమ వచ్చింది అంటే సందడి మొదలైనట్టే. మళయాళం నుండి వచ్చిన సుమ తెలుగులో యాంకర్ గా స్థిర పడ్డది. రాజీవ్ కనకాలను పెళ్లాడి ఇండస్ట్రీకి దగ్గరైంది. రెండు దశాబ్ధాలుగా వ్యాఖ్యాతగా కొనసాగుతున్న ఒకే ఒక్క యాంకర్ సుమ మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పుడు సుమ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది.

11 ఏళ్లుగా ఒకే షో వ్యాఖ్యాతగా కొనసాగిస్తూ.. 3 వేల ఎపిసోడ్స్ పైగా చేస్తుంది సుమ. ఈటివిలో స్టార్ మహిళ షో 2008 నుండి ప్రసారం అవుతుంది. ఆగష్టు 9, 2008లో ఈ షో మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. ఇటీవలే 3 వేల ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది స్టార్ మహిళ. ఇన్నేళ్లు.. ఇన్ని వేల ఎపిసోడ్స్ చేసిన షో ఇండియాలోనే అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది స్టార్ మహిళ. ఈ షో ద్వారా సుమ ఇప్పటికే లిమ్కా బుక్ రికార్డ్ లో చేరింది. తన మాటల చాతుర్యంతో సుమ చేసే సందడి అంతా ఇంతా కాదు. టివి షోలనే కాదు సినిమా ఇంటర్వ్యూస్, ఈవెంట్స్ కు సుమ యాంకరింగ్ చేస్తుంది. ఇన్నేళ్లు గడుస్తున్నా అదే ఎనర్జీతో అలరిస్తున్న సుమ మరో పదేళ్లు యాంకర్ గా కొనసాగాలని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news