వైసీపీలో చేరి పవన్ కళ్యాణ్‌ ఫాన్స్ నాలుక కోస్తా : జూ.ఆర్టిస్ట్

-

మెగా ప్రొడ్యూసర్ బన్నీవాసు తనకు సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి మాట తప్పారని వార్తల్లోకి వచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ… మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు ను టార్గెట్ చేస్తున్న జనసేన పార్టీని కడిగి పారేసింది. త్వరలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆధ్వర్యంలో వైసీపీలో జాయిన్ అవుతానని ప్రకటన చేసింది. అంతేకాదు.. వైసీపీలో చేరి పవన్ కళ్యాణ్‌ ఫాన్స్ నాలుకలు కోస్తా అంటూ జూ.ఆర్టిస్ట్ సునీత వార్నింగ్‌ ఇచ్చింది.

అలాగే.. టాలీవుడ్‌ ప్రొడ్యూసర్ బన్నీ వాసు, గీతా ఆర్ట్స్ సంస్థపై జూ. ఆర్టిస్ట్ బోయా సునీత సంచలన ఆరోపణలు చేసింది. నిర్మాత బన్నీ వాసు తనను కారులో తీసుకు వెళ్లి సెక్సువస్ గా హెరాష్ చేసాడని జూనియర్‌ ఆర్టిస్ట్‌ సునీత నిప్పులు చెరిగారు. జనసేన పార్టీలో ఉన్న బన్నీ వాసు పై పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయాలని తాను అనుకున్నప్పుడల్లా…ఆయన దృష్టికి తీసుకుని వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆమె పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news