ట్రెండ్ ఇన్: సౌత్ డైరెక్టర్‌తో షారుఖ్ ఖాన్ మూవీ..‘జవాన్’పై భారీ అంచనాలు

-

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సినీ ప్రేక్షకులకు చివరగా ‘జీరో’ సినిమాలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ క్రమంలోనే సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని షారుఖ్ అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ తమిళ్ ఫిల్మ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాకు ‘జవాన్’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పిక్చర్ పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. తలపతి విజయ్ తో సూపర్ హిట్ సినిమాలు ‘పోలీసోడు’,‘విజిల్’ సినిమాలు చేసిన అట్లీ ప్రస్తుతం..షారుఖ్ ఖాన్ తో ‘జవాన్’ సినిమా చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా అప్ డేట్ ఇవ్వాలని కోరుతూ నెటిజన్లు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా #Atlee హ్యాష్ ట్యాగ్ అట్లీ తో వరుస ట్వీట్లు చేశారు. దాంతో సదరు హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ త్వరలో విడుదల చేస్తారని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.

1 నిమిషం 34 సెకన్ల నిడివి గల టీజర్ త్వరలో విడుదలవుతుందని అంటున్నారు. ఇందులో హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ పిక్చర్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ తిరగరాయాలని అనుకుంటున్నారు. షారుఖ్ ఈ చిత్రంతో పాటు ‘పఠాన్’ ఫిల్మ్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రాజ్ కుమర్ హిరానీ దర్శకత్వంలో ‘డుంకీ’ ఫిల్మ్ చేయనున్నారు. ఇందులో హీరోయిన్ గా టాలెంటెడ్ తాప్సీ పన్ను నటించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news