బాహుబలి అక్క‌డ హిట్‌… సైరా ఫ‌ట్‌.. తేడా ఇదే

-

రెండు భారీ బ‌డ్జెట్ సినిమాలు… రెండు తెలుగు సినిమా హీరోలు చేసిన‌వే.. తెలుగు సినిమా డైరెక్ట‌ర్లు డైరెక్ట్ చేసిన‌వే. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాగా వ‌చ్చిన‌వే. అయితే బాహుబ‌లి ఇటు తెలుగుతో పాటు అటు త‌మిళ్‌లో కూడా క‌నెక్ట్ అయ్యింది. ఇక హిందీలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చూశాం.. త‌మిళ్‌, మళ‌యాళంలోనూ బంప‌ర్‌గా ఆడేసింది. క‌ట్ చేస్తే ఇప్పుడు సైరా ఒక్క తెలుగులో అది కూడా ఏపీలో మాత్ర‌మే బాహుబ‌లికి పోటీ ఇస్తోంది.. మిగిలిన నైజాంతో పాటు ఇత‌ర భాష‌ల్లో ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోతోంది. బాహుబ‌లికి పోటీ ఇవ్వ‌డం సంగ‌తి దేవుడు ఎరుగు… ఇత‌ర భాష‌ల్లో భారీ న‌ష్టాలు త‌ప్పేలా లేవు.

మ‌రి ఈ రెండు సినిమాల మ‌ధ్య ఇంత వ్య‌త్యాసం ఎందుక‌న్న‌ది ప‌రిశీలిస్తే… బాహుబలి భళ్లాలదేవుడ్ని చంపే సీన్ వచ్చినప్పుడు థియేటర్లన్నీ చప్పట్లు, అరుపులతో హోరెత్తాయి, సైరాలో నరసింహారెడ్డి ఆంగ్లేయుల తలలు నరికినప్పుడు దాదాపు అలాంటి మూమెంటే ఉంటుంది. సినిమా చూసిన చాలా మంది తొలిరోజే బాహుబ‌లికి ఏ మాత్రం తీసిపోద‌ని తీర్పు ఇచ్చేశారు. అయితే రాజ‌మౌళి బాహుబ‌లిలో మ‌హిష్మ‌తి సెట్ వేసి ఓ యూనివ‌ర్సిల్ స‌బ్జెక్ట్‌గా మార్చేశాడు. ఆ క‌థ‌కు వేసిన మ‌హిష్మ‌తి సెట్‌, ఆ సామ్రాజ్యం ఏ భాష‌లో అయినా క‌నెక్ట్ అవుతుంది.

కానీ సైరా తెలుగులో అది కూడా రాయ‌ల‌సీమ‌కు చెందిన ఓ చారిత్ర‌క పోరాట యోధుడి గాథ‌. ఇంకా చెప్పాలంటే ఇది క‌ర్నూలు జిల్లా క‌థ అన్న‌ది ఎవ్వ‌రికి అయినా సులువుగానే అర్థ‌మ‌వుతుంది. సైరా ఫాన్ ఇండియా సినిమాగా ప్రొజెక్ట్ చేసేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా అది తెలుగు రేంజ్ దాటి వెళ్ల‌లేదు. అంత‌కు ఇత‌ర భాష‌ల్లో క్రేజ్ కోసం ఆ భాష‌ల స్టార్ న‌టులును తీసుకున్నా అక్క‌డ జ‌నాల‌కు రీచ్ కాలేదు. ఇక చిరు హీరో కావ‌డం… తొలి రోజు అభిమానులు భారీగా పోటెత్త‌డంతో క‌లెక్ష‌న్లు దుమ్ము రేపాయి.

బాహుబలి సినిమాలో ప్రతి 20 నిమిషాలకు ఓ హై-పాయింట్ కనిపిస్తుంది. ఆ ట్విస్ట్ లు, ఆ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. సైరాలో ఫ‌స్ట్ 30 నిమిషాలు చాలా స్లోగా ఉంటుంది. సైరా బాల్యం, త‌మ‌న్నాతో ల‌వ్ ట్రాక్ కాస్త సినిమాను స్లో చేశాయి. ఇక బ‌డ్జెట్ ప‌రంగా సైరాను బాహుబ‌లి రేంజ్‌లో ఎస్టాబ్లిష్ చేశారు.
సరిగ్గా ఇక్కడే సైరాకు బాహుబలికి మధ్య పోలిక వచ్చింది. బాహుబ‌లి సినిమాలో ప్ర‌భాస్‌, రానాను చూస్తుంటే బాహుబ‌లి, బ‌ళ్లాల‌దేవుడే క‌నిపిస్తే.. సైరాలో సైరా క‌న్నా చిరుయే ఎస్టాబ్లిస్ అయ్యాడు. ఈ లోపాల‌న్ని సైరాను ఇత‌ర భాష‌ల్లో ప్రేక్ష‌కుల‌కు స‌రిగ్గా క‌నెక్ట్ చేయ‌లేక‌పోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news