‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడిపై బాబు గోగినేని సెటైర్లు.. మరి అప్పుడలా ఎందుకు చెప్పారని రాజమౌళికి ప్రశ్న..

-

మాస్టర్ స్టోరి టెల్లర్ ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజ్యువల్ వండర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని చూసి దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు అభిమానులు, సామాన్యులతో పాటు సెలబ్రిటీలు పోటెత్తారు. ఇకపోతే ఈ చిత్రం ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటినీ తిరగరాసి, నెంబర్ వన్ ప్లేస్‌లో ఉంటుందని మెగా, నందమూరి అభిమానులు అంటున్నారు. ఈ ఫిల్మ్ ప్రమోషన్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ డైరెక్టర్ రాజమౌళి ఆకాశమే హద్దుకు ముందుకు సాగారని చెప్పొచ్చు.

హీరోలిద్దరిని తన వెంట తీసుకుని రాజమౌళి దేశవ్యాప్తంగా పలు నగరాలతో పాటు దుబాయ్ కూడా వెళ్లొచ్చారు. సినిమా విడుదల ముందు రోజు వరకు కంటిన్యూయస్‌గా ప్రమోషన్స్‌లోనే ఫుల్ బిజీగా గడిపేశారు. ఈ క్రమంలోనే రాజమౌళి హీరోలు రామ్ చరణ్, తారక్ తో కలిసి పలు ప్రదేశాలను స్పందించారు. అక్కడ పూజలు కూడా చేశారు. ఈ క్రమంలోనే గతంలో తాను నాస్తికుడినని చెప్పుకున్న రాజమౌళి ఇప్పుడు ఎందుకు పూజలు చేస్తున్నారంటూ నాస్తికుడు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, ‘బిగ్ బాస్’ ఫేమ్ బాబు గోగినేని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

సోషల్ మీడియాలో పలు సామాజిక, రాజకీయ, సినిమా అంశాలపైన బాబు గోగినేని స్పందిస్తుంటారు. ప్రతీ ఒక్కరు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని చెప్తుంటారు. ఈ క్రమంలోనే మూఢ నమ్మకాలు ఆచరించే వారిపైన బాబు గోగినేని సెటైర్స్ వేస్తుంటారు. ఈ సారి ఆయన ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు రాజమౌళిపైన సెటైర్స్ వేస్తున్నారు. తాను నాస్తికుడినని రాజమౌళి చెప్పిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన బాబు గోగినేని.. నాస్తికుడు గురుద్వార్ వద్ద పూజలు చేయడమేంటని అడిగారు.

‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్‌లో భాగంగా గురుద్వార్‌లో రాజమౌళి, రామ్ చరణ్, రామారావు పూజలు చేశారు. కాగా, నాస్తికుడని ప్రకటించుకుని, పూజలు చేయడం ఎబ్బెట్టుగా ఉంటుందని ఈ సందర్భంగా బాబు గోగినేని చెప్పారు. భక్తులు దేవుడి పట్ల నమ్మకం కలిగి ఉన్న మాదిరిగానే, నాస్తికులు కూడా వారు అనుకున్న విషయాల్లో నిజాయితీగా ఉండాలని సూచించారు. దేవుడిని, అదృశ్య శక్తులను నమ్మబోనప్పుడు గుడికి, గురుద్వారకు, నదికి వెళ్లాల్సిన అవసరమేముందని బాబు గోగినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news