వెంకటేశ్ మూవీ షూటింగ్‌లో ఖుష్బూకు చేదు అనుభవం.. ఆమె ఏం చేసిందంటే?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ..ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. ఇటీవల విడుదలైన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో ఖుష్బూ వెరీ డిఫరెంట్ రోల్ ప్లే చేసింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కలియుగ పాండవులు’ చిత్రంతో ఖుష్బూ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఖుష్బూ ఆ తర్వాత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయంది.

 

ఖుష్బూకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళ నాట కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళనాడులో అయితే ఏకంగా ఖుష్బూ కోసం గుడి కట్టేశారు అభిమానులు. అయితే, ఖుష్బూ తన కెరీర్ స్టార్టింగ్ డేస్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. విక్టరీ వెంకటేశ్ సరసన హీరోయిన్ గా ఖుష్బూ నటించిన ‘కలియుగ పాండవులు’ చిత్ర షూటింగ్ లో ఎదురైన చేదు అనుభవం గురించి వివరించింది ఖుష్బూ.

కె.రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘కలియుగ పాండవులు’ పిక్చర్ షూటింగ్ టైమ్ లో ఎవరో ఒక వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఖుష్బూను తాకాడు. దాంతో వెంటనే అతని చెంప పగులగొట్టింది. అక్కడ పక్కనే సురేశ్ బాబు, రామానాయుడు ఉన్నారు. వారు వెంటనే అప్రమత్తమై ఖుష్బూకు మద్దతుగా నిలిచారు.

అలా ఆ చిత్ర షూటింగ్ టైమ్ లో తనకు చేదు అనుభవం ఎదురైందని ఖుష్బూ చెప్పుకొచ్చింది. వెండితెరపైన పలు సినిమాల్లో నటించి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను అలరించిన ఖుష్బూ.. ప్రజెంట్ బుల్లితెరపైన కూడా సందడి చేస్తోంది. పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’కు ఖుష్బూ జడ్జిగా వ్యవహరిస్తున్నది. ఈ షోలో ఆమె తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రజలను ఎంటర్ టైన్ చేస్తోంది.