ఆర్ధికంగా బలపడేందుకు ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకునే మహిళా సంఘాలకు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. శనివారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో నిర్వహించిన మహిళా సమాఖ్య మహాజన మరియు రుణమేళా కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమ్మర్ పల్లి మండలానికి చెందిన మహిళా సమాఖ్య సంఘాలకు 15 కోట్ల 26 లక్షల రూపాయల రుణ చెక్కును అందజేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశలో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు రుణపరిమితి రూ.5 లక్షలు ఉంటే దాన్ని రూ.20 లక్షలకు పెంచారని, వ్యక్తిగతంగా రుణ పరిమితిని కూడా రూ.50 వేల నుంచి రూ.3 లక్షలకు పెంచారని గుర్తు చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. దీంతో చాలా కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి
చెందాయని తెలిపారు.
ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే కమ్మర్ పల్లి మండలంలో రూ.32 కోట్ల నుంచి 160 కోట్ల రూపాయల రుణాలకు చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇప్పటి వరకు తీసుకున్న రుణాలను ఆర్ధిక క్రమశిక్షణతో చెల్లిస్తూ ఇంత మొత్తం రుణం పొందే స్థాయికి చేరుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. దీని ద్వారా 2600 కుటుంబాలు ఆర్థికంగా బాగుపడడం ఒక ప్రజాప్రతినిధిగా తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇంతటి కృషి కేవలం మహిళల వల్లే సాధ్యం అయ్యిందని, పురుషులలో ఇంతటి సంఘటితం ఉండదని, మీరు కష్టపడి కూడ బెట్టుకున్న పైసా డపైసాను ధరలు పెంచి కేంద్రం దోచుకుపోతోందని కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.