నటసింహ బాలకృష్ణ సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేసిన చిత్రం వీరసింహారెడ్డి.ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.100కోట్ల మార్క్ క్రాస్ చేయడంతో సినిమాకు సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే వీరసింహుని విజయోత్సవం పేరిట సక్సెస్ మీట్ నిర్వహించగా అందులో బాలయ్య ఫ్లోలో అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడడం ఇప్పుడు అక్కినేని అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ముఖ్యంగా ఈ విషయంపై బాలయ్య క్షమాపణలు చెప్పాలి అని అక్కినేని అభిమానులు తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. అందుకు తోడుగా అక్కినేని వారసులు కూడా పెద్దలను గౌరవించకపోవడం మనల్ని మనం కించపరిచినట్టే అంటూ కూడా ట్వీట్లు చేయడంతో ఈ వివాదం మరింత చెలరేగింది.
మరొకవైపు నందమూరి బాలకృష్ణకు ఎస్వీ రంగారావు మనవాళ్లు కూడా మద్దతు పలికారు. అయినా కూడా వివాదం సద్దుమనగలేదు .దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన నందమూరి బాలకృష్ణ.. అక్కినేని నాగేశ్వరరావు పై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.. ఆయనతో తనకు గొప్ప అనుబంధం ఉందని.. అంతటి మహానటుడిని కించపరిచే ఉద్దేశం తనకు లేదు అని.. అయితే తాను ఆ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావు అని.. ఎవరిని కించపరచాలని తనకు లేదు అంటూ వివాదానికి పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. నేను అక్కినేనిని బాబాయి అని పిలుస్తాను. ఆయన కూడా నా పట్ల చాలా ఆప్యాయతతో ఉండేవారు
ఒకరకంగా చెప్పాలి అంటే నాగార్జున కంటే నాతోనే ఎక్కువ ఆప్యాయతగా ఉండేవారు. పొగడ్తలకు లొంగిపోకూడదని నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. ఎన్టీఆర్ను కూడా ఎన్టీ వోడు అని పిలుస్తారు అని.. ఒక్కో ప్రాంతం.. ఒక్కో భాష .. యాసలు ఉపయోగిస్తూ తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అదంతా ప్రేమ మాత్రమే.. నేను కూడా ఇదే కోణం లోనే మాట్లాడాను తప్పించి ఎవరిని నొప్పించాలని కాదు అంటూ బాలకృష్ణ వెల్లడించారు.. మొత్తానికైతే బాలకృష్ణ క్లారిటీ ఇవ్వడంతో అక్కినేని , నందమూరి అభిమానుల మధ్య గొడవకు బ్రేక్ పడిందని చెప్పవచ్చు.