బ్యూటీ స్పీక్స్ : అమ‌లిన శృంగారం.. నిర్మ‌ల సంబంధం

-

మ‌నుషులంతా ఏమ‌వుతున్నారు.. రాత్రి నుంచి ఉద‌యం వ‌ర‌కూ ఉన్న నిషాలో ఉంటున్నారు. స్వేద జ‌ల‌ధిలో మునిగి తేలుతున్నారా? కోరిక‌ల ద‌గ్గ‌ర బంధీలు వీరు అని రాయ‌డంలో పాపం మ‌నిషిని అవ‌మానించిన వాడిని అవుతానా ? ఏకాంతాల‌ను ప్ర‌సాదించిన రాత్రులు నిద్ర‌ల‌ను వెలివేయించిన రాత్రులు క‌ల‌లకూ క‌ల‌హాల‌కు నిండు అర్థాలు చెప్పే రాత్రులు మ‌నుషుల‌కు దూరంగా ఉన్నాయి. గ‌దిలో రంగుల దీపాల ఆడంబ‌రాలు ఆగాక ఏకాంతం అర్థ ర‌హితం.

 

ఆమె సామీప్యం ప్ర‌యోజ‌న పూర్వ‌కం.. కొన్ని సార్లు.. ఆమె సామీప్యం అయిష్టా పూర్వ‌కం ఇంకొన్ని ప‌ర్యాయాలు..ఇప్పుడ‌యినా మ‌నిషి ఏకాంతాల‌ను కోరుకోవ‌డంలో అర్థం లేదు. అవి ఉన్నా విషాద వ‌ర్ణాల‌ను ప‌రిచయం చేసి వెళ్తాయి.అర్థ‌వంతం అయిన చీక‌టి అర్థం చెడిన రాత్రి ఈ రెండూ కూడా ఉంటాయని చ‌దివేను. అవును గుడ్డి వెలుగుల చెంత క‌లిసిన దేహాల‌కు ప్ర‌యోజ‌నం క‌న్నా అవ‌స‌రం ఒక‌టి వాంఛ‌కు ప్రేర‌ణ.. ప్రేరేపిత వాంఛ‌లు అమ‌లిన శృంగారానికి కార‌ణం కావు. కాకూడ‌దు కూడా!

దేహం నిర్మల సంబంధం అయి ఉందా? ప్రేమ నిర్మ‌ల సంబంధం అయిందా ? సందేహాల‌న్న‌వి జీవితాల‌ను నిలువునా ముంచెత్తుతున్నాయి. మ‌నుషులు మార్మిక ధాతువుల దగ్గ‌ర త‌మ‌ని తాము త‌గ్గించుకుంటూ ఉంటారు. మాయా వ‌ర్ఛ‌స్సును పెంచుకుని ఉంటారు. న‌గ్న దేహాల కూడిక‌ల్లో ఇష్టాలు సుఖాలు ప‌రివ్యాప్తితాలు.. న‌గ్న దేహాల కూడిక‌ల్లో స్వేద లిపి చెంత వెల్లువలోకి వ‌చ్చే నిశ్వాస ఝ‌రి ఒక లిప్త కాలం కోరిక‌కు సంకేతిక. మ‌రి! ప్రేమ ఏమౌతుంది. విచ్ఛిన‌క‌ర ధోర‌ణిలో ఉన్న ప్రేమ ఏమౌతుంది. విభేదించిన చాలు ప్రేమ ఏమౌతుంది. విశేషించిన ప్రేమ ఏమౌతుంది.. ఇదే ఇవాళ్టి బ్యూటీస్పీక్స్.

అచ్ఛ‌మ‌యిన ప్రేమ‌లు మ‌న మ‌ధ్య లేవు అన్న‌ది ఓ అంత‌ర్మ‌థ‌నం. పార్కుల్లో ప్రేమ‌ల్లో కోరిక‌లు దేహార్తి దాహార్తి తీర్చేవి త‌ప్ప మ‌రొక‌టి కావు. ప‌బ్బుల్లో ప్రేమ‌లు మ‌త్తు నుంచి మైకం వ‌ర‌కూ ముంచెత్తేవి త‌ప్ప ఇంకొక‌టి కావు. దేహం కోరుకున్న‌త మ‌న‌స్సు నిర్మ‌లం చేసినంత వ‌య‌స్సును అర్ప‌ణం చేశాక.. ప్రాయానికో సొగ‌సు కొత్త వ‌ర్ఛ‌స్సు శృంగారం ఇచ్చి వెళ్తుందా?

అందుకే అంటున్నా అందం డేంజ‌ర్ అయి ఉంది. అమ్మాయి డేంజ‌ర‌స్ అయింది. ఆధునికంలో తుల‌తూగేవి అన్ని అర్థ సంబంధాలు కాదు కేవ‌లం మోహ సంబంధాలు. క్ష‌ణికం అయిన మోహాల‌లో శృంగారం బాగుంటుంది. జీవితం చెడి ఉంటుంది.
సముద్రాల చెంత గాలులు మోసే ఊసులు అర్థం అవుతాయా? అమ‌లిన శృంగారం దేహ వాంఛ‌కు ద‌గ్గ‌ర‌గా ఉండ‌దు.. న‌గ్న దేహాల కూడిక‌ల‌కు అర్థం చెడి చాలా కాలం అయింది. కేవ‌లం అర్థం వికృతం ఇక్క‌డ.. ప్ర‌కృతి సంబంధ చ‌ర్య వికృతం అంటే ప్రాకృతికం ఇక్క‌డ వికృతం వివ‌ర్ణం కూడా !

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
– బ్యూటీ స్పీక్స్ – మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Latest news