అన్నా చెల్లెళ్లుగా ఎన్టీఆర్, సావిత్రి కన్నీళ్లు పెట్టించిన చిత్రమిదే..

-

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ , నటరత్న నందమూరి తారక రామారావు (సీనియర్), సావిత్రి జంటగా పలు సినిమాల్లో నటించారు. వీరు కలిసి నటించిన ‘గుండమ్మ కథ’ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ చిత్రం పూర్తి అయిన తర్వాత వీరు కలిసి నటించిన చిత్రం ‘రక్త సంబంధం’. అయితే, ఇందులో వీరు హీరో, హీరోయిన్లుగా కాకుండా అన్నా చెల్లెళ్లుగా నటించారు. అలా వారి కాంబో ఎలా కుదరిందనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

వెండితెరపైన ఒకసారి జంటగా కనబడితే చాలు.. జనాలు వారిని అలానే గుర్తు పెట్టుకుంటారు. కాగా, ఆ స్టీరియో టైప్ ను అప్పట్లోనే బ్రేక్ చేశారు సీనియర్ ఎన్టీఆర్. తన సరసన హీరోయిన్ గా నటించిన సావిత్రితో చెల్లెలిగా నటించారు. అలా ‘రక్త సంబంధం’ సినిమాలో వారిరువురి నటన చూసి జనాలు కన్నీటి పర్యంతమయ్యారు. జనాలకు విశేషంగా ఆ చిత్రం నచ్చింది.

వి.మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం..ప్రేక్షకుల మెప్పు పొందింది. ఘంటసాల స్వరపరిచిన గీతాలన్నీ ప్రజలకు బాగా నచ్చాయి. అయితే, ఈ చిత్రం తమిళ్ ఫిల్మ్ ‘పాశమలర్’ ఆధారంగా తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి రచించారు రచయిత.

ముళ్లపూడి స్క్రిప్ట్ రెడీ చేయగా, తొలుత ఇందులో హీరోగా నటించాలని దర్శకుడు ఏఎన్ ఆర్ వద్దకు వెళ్లారు. ఇందులో చెల్లెలి పాత్రకు సావిత్రిని అనుకుంటున్నట్లు చెప్పగానే ఏఎన్ఆర్ నో చెప్పారు. అలా ఈ కథ ఎన్టీఆర్ వద్దకు వెళ్లింది.

ఎన్టీఆర్ ఈ కథ విని బాగా నచ్చిందని చెప్పేశారు. అలా సావిత్రికి అన్నయ్యగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా దేవిక నటించింది. ఈ చిత్ర విడుదలకు కొద్ది రోజుల ముందే ‘గుండమ్మ కథ’ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా ఎన్టీఆర్ -సావిత్రి ప్రేక్షకులకు కనిపించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే అన్నా చెల్లెళ్లుగా కనిపించారు. అయినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాను విశేషంగా ఆదరించారు.

Read more RELATED
Recommended to you

Latest news