‘భైరవగీత’ ట్రైలర్.. ఆర్జివి మార్క్

-

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ సమర్పణలో వస్తున్న మూవీ భైరవగీత. ధనుంజయ, ఇర్రామోర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. సినిమాలో ఆర్జివి మార్క్ వాయిలెన్స్.. లవ్.. రొమాన్స్ అన్ని సమపాళ్లలో ఉన్నాయని అనిపిస్తుంది. సిద్ధార్థ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ నామా, భాస్కర్ రాసి నిర్మిస్తున్నారు.

సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండగా లీడ్ పెయిర్ మధ్య రొమాన్స్ కూడా అదిరిపోయింది. ఈ సినిమాకు వర్మ కేవలం నిర్మాతే అయినా కూడా వర్మ మార్క్ కనిపించేలా కథ, కథనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాను వర్మ నిర్మిస్తున్నాడు కావొచ్చు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించగా సినిమా ఎలాంటి ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి. నవంబర్ 22న భైరవగీత రిలీజ్ ప్లాన్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news