ఆకాశ్ పూరీ ‘చోర్ బజార్’ పాటపై అమితాబ్ బచ్చన్ రియాక్షన్ ఇదే..

-

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ..నటించిన తాజా చిత్రం ‘చోర్ బజార్’. శుక్రవారం విడుదలైన ఈ పిక్చర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నది. ‘జార్జిరెడ్డి’ ఫేమ్ జీవ‌న్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఆకాశ్..బాలీవుడ్ బిగ్ బీ..అమితాబ్ బచ్చన్ పాత్రలో కనిపిస్తాడు.

Amithab
Amithab

ఈ నేపథ్యంలో అమితాబ్ కు డెడికేట్ చేస్తూ ‘బచ్చన్ సాబ్’ ఫ్యాన్ ఆంథెమ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట‌కు మంచి స్పందన వస్తోంది. కాగా, ఎట్టకేలకు ఈ సాంగ్ ను అమితాబ్ సైతం విన్నాడు.ఆయన రియాక్షన్ ను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు బిగ్ బీ. సదరు ట్వీట్ నెట్టింట ప్రజెంట్ వైరలవుతోంది.

‘‘ఉఫ్ ఏం చెప్పాలి..చాలా సంతోషకరంగా ఉంది..మై ల‌వ్, రెస్పెక్ట్’’ అంటూ రీట్వీట్ చేశారు. అమితాబ్ బచ్చన్ ట్వీట్ తో ఈ సాంగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ ఫిల్మ్..కు సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. సుబ్బరాజు, సునీల్, సంపూర్ణేశ్ బాబు కీల‌క పాత్రలు పోషించగా, గెహనా సిప్పి హీరోయిన్ గా నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news