Bigg Boss Telugu 8 : రేషన్ కావాలంటే లెమన్ పిజ్జా.. మణికంఠ పై పెద్ద బాధ్యత.. చీఫ్ ని గెలిపిస్తాడా..?

-

మొదటివారం బిగ్ బాస్ సీజన్ 8 లో ఎలాంటి టాస్కులు లేకుండా రేషన్ ని ఇచ్చారు. కానీ రెండవ వారం నుంచి రేషన్ కావాలంటే టాస్కులు మొదలు అనే విషయం అందరికీ అర్థమైంది. తాజాగా విడుదలైన ప్రోమో టీం లోని కంటెస్టెంట్స్ కి రేషన్ కావాలంటే చీఫ్ ఆటలు ఆడి గెలవాలని బిగ్ బాస్ వివరించారు. చీఫ్ తమ టీం మేట్స్ తో కలిసి ఆట మొదలుపెట్టారు. రేషన్ ని గెలుచుకోవడానికి యాక్షన్ ఏరియాలో ఒక సూపర్ మార్కెట్ పెట్టబడి ఉంది. ఈ వారానికి సరిపడా ఆహారాన్ని తీసుకురావడం చీఫ్స్ బాధ్యత. యష్మి టీం లో ఎక్కువ మంది సభ్యులు ఉండడంతో మొదటి బజర్ మోగగానే రేషన్ తీసుకురావడానికి వెళ్ళింది.

రెండో బజర్ కి నైనిక మూడో బజార్ కి నిఖిల్ వెళ్లారు. యాక్షన్ ఏరియాలోకి వెళ్లి తమకు ఇచ్చిన బుట్టలో రేషన్ తీసుకున్నారు. అయితే మరో ఆట ఆడాల్సి ఉంది. వరుసగా బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్లను గెలిస్తేనే కావాల్సిన ఆహారం చేతికి వస్తుంది. బిగ్ బాస్ ఇచ్చిన మొదటి ఛాలెంజ్ లెమన్ పిజ్జా. ప్రస్తుతం నిఖిల్ టీం లో నాగమణికంఠ మాత్రమే ఉన్నాడు. కనుక వారిద్దరూ కలిసి లెమన్ పిజ్జా ఛాలెంజ్ కోసం సిద్ధమయ్యారు.

నైనికా టీం నుంచి తనతో పాటు నబీల్ రంగంలోకి దిగాడు. యాష్మి టీమ్ నుంచి పృథ్వి అభయ్ వచ్చారు. శేఖర్ భాష సంచలకుడిగా వ్యవహరించాడు. లెమన్ పిజ్జా గేమ్ లో నయని టీం, యాష్మి టీం ఒక్కొక్కసారిగ పజిల్ని కింద టచ్ చేసాయి. కాబట్టి ఆటను మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. అయితే చాలెంజ్ లో ఎవరు విన్ అయ్యారు అన్న విషయాన్ని మాత్రం ప్రోమోలో చూపించలేదు. మరి మణికంఠ చీఫ్ ని గెలిపిస్తాడు లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version