బిగ్‌బాస్4 లో “జ‌బ‌ర్ద‌స్త్” జాత‌ర‌..!

-

బిగ్‌బాస్‌4 అతిత్వ‌ర‌లో మ‌న‌ముందుకు రాబోతుంది. షో నిర్వాహ‌కులు ప్ర‌మోష‌న్ వేగ‌వంతం చేశారు. బ్యాక్ టూ బ్యాక్ ప్రో‌మోల‌తో ప్రేక్ష‌కుల ఆక‌ట్టుకునే ప‌నిలో ఉన్నారు. ఇక కంటెస్టంట్స్ దాదాపుగా ఫైన‌ల్ చేశారు కంటెస్టంట్స్ ఎవ‌ర‌న్న‌ది స‌స్పెన్స్‌గా ఉంచారు. ఇక మీడియా లీకుల‌ను బట్టి తెలుస్తున్న స‌చారం ఏంటంటే..

జ‌బ‌ర్ద‌స్త్ షోతో ఫేమ‌స్ అయిన ఆటో రామ్ ప్ర‌సాద్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్ళ‌నున్న‌ట్లు కృష్ణాన‌గ‌ర్ టాక్‌. రామ్ ప్ర‌సాద్‌తో పాటు అవినాశ్ పేరు కూడా వినవ‌స్తుంది. ఏది ఏమైనా జ‌బర్ద‌స్త్ నుండి ఒక‌రు మాత్రం బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్ట‌నున్నార‌ట‌.

బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ఆక‌ట్టుకొని, బిగ్‌బాస్‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేశాడు. రెండో సీజ‌న్‌ను నాచుర‌ల్ స్టార్ నాని హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించాడు. బిగ్‌బాస్‌3 సీజ‌న్‌కు కింగ్ నాగార్జున హోస్ట్ చెయ్య‌గా,, ఇప్పుడు 4వ సీజ‌న్ కూడా నాగ్ హోస్ట్ చెయ్య‌నున్నాడు. ఇక ఈ షో ఆగ‌స్ట్ 30 నుండి టెలికాస్ట్ అవ్వ‌నుంద‌ని తెలుస్తున్నా, షో నిర్వాహ‌కుల‌నుండి అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. షో నిర్వ‌హించేందుకు క‌రోనా టెస్టులు చేసి, 10 రోజులు క్వారంటైన్ త‌ర్వాత‌నే కంటెస్టంట్స్‌ని హౌస్‌లోకి పంపిస్తార‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news