మాట నిలబెట్టుకున్న చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ..!!

-

చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు డైరెక్టర్ మోహన్ రాజా. ఇక ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటించారు. అంతేకాకుండా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో సత్యదేవ్, నయనతార ,పూరి జగన్నాథ్, మురళి శర్మ, సముద్రఖని తదితరులు నటించడం జరిగింది. వీరితోపాటు మెగాస్టార్ సినిమాలో ఒక ముద్దుగుమ్మ తలుక్కుమని మెరిసింది. ఆమె ఎవరో కాదు బిగ్ బాస్ తో మంచి స్థానాన్ని సంపాదించుకున్న దివి వద్యతా.

ఇక ఈ సినిమాలో ఈమె సునీల్ భార్య రేణుక పాత్రలో నటించింది దివి. ఇక బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొన్న ఈమె తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. కానీ బిగ్ బాస్ లో మాత్రం ఈమె విజేతగా నిలవలేకపోయింది. తన అందం ప్రవర్తన తో పలువురిని బాగానే ఆకట్టుకున్న ఆ సీజన్ ఫైనల్ వరకు వెళ్ళింది. ఇక ఆ ఫైనల్ చీఫ్ గెస్ట్ గా చిరంజీవి హాజరు అయినప్పుడు దివిని చూసి మెస్మరైజ్ అయ్యారు. దీంతో తన తదుపరి సినిమాలో ఆమెకు అవకాశం కల్పిస్తానని ఆ వేదిక పైన చెప్పారు.

అలా తన మాటను ఇప్పుడు నెరవేర్చుకున్నారు చిరంజీవి… కాగా మొదట భోళా శంకర్ సినిమాలో ఆమెను పోలీసు అధికారి పాత్ర ఇచ్చినట్లుగా వార్తలు వినిపించాయి. కానీ అనూహ్యంగా గాడ్ ఫాదర్ సినిమాలో ఇలాంటి కీలకమైన పాత్రలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. ఇక విడుదల కాకముందే ఈ సినిమా ప్రమోషన్లలో కొన్ని ప్రెస్ మీట్ల ద్వారా ఈమె నటిస్తున్నట్లు తన పాత్ర గురించి కూడా తెలియజేసింది. చిరంజీవి తన మాట నిలబెట్టుకున్నారని అభిమానులు కూడా చాలా సంబరపడిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news