ఎక్కువ నీరసంగా ఉంటోందా..? అయితే సామర్ధ్యాన్ని ఇలా పెంచుకోవచ్చు..!

-

చాలా మందికి బలహీనంగా నీరసంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అటువంటప్పుడు వాళ్లలో స్టామినాని పెంచుకోవాలి అనుకుంటూ ఉంటారు. మీకు కూడా తరచూ నీరసంగా బలహీనంగా అనిపిస్తూ ఉంటుందా..? అయితే కచ్చితంగా ఈ ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండండి.

వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది పైగా సామర్థ్యం పెరుగుతుంది. ఇంట్లో పనులు ఆఫీసు పనులు ఇలా చాలా ఉంటూ ఉంటాయి. అటువంటప్పుడు మనం మంచి ఆహార పదార్థాలను డైట్ లో తీసుకుంటూ ఉండాలి ఇటువంటి ఆహార పదార్థాలను కనుక తింటే సామర్థ్యం పెరుగుతుంది నీరసం తగ్గుతుంది.

బీన్స్:

బీన్స్ లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఫాలిక్ యాసిడ్ మొదలైన పోషక పదార్థాలు బీన్స్ లో ఉంటాయి బలహీనంగా నీరసంగా అనిపిస్తుంటే బీన్స్ తీసుకుంటూ ఉండండి.

బ్రౌన్ రైస్:

ఇది కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. నెమ్మదిగా ఎనర్జీని బ్లడ్ లోకి పంపిస్తుంది. రోజంతా కూడా మీరు ఆరోగ్యంగా బలంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

గుడ్లు:

గుడ్లు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.

ఆకుకూరలు:

ఆకుకూరల్లో కూడా పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి వీటిని తీసుకుంటే కూడా మనకి సామర్థ్యం పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది.

కాఫీ:

కాఫీ ఇన్స్టెంట్ గా ఎనర్జీ ని పెంచుతుంది కాఫీ తాగడం వల్ల బ్రెయిన్ లోకి ఎనర్జీ వెళ్తుంది. ఒక కప్పు కాఫీ సెంట్రల్ నెర్వస్ సిస్టం పై కూడా ప్రభావం చూపిస్తుంది. నీరసాన్ని కూడా ఈజీగా తగ్గించేస్తుంది. అలానే చిలకడదుంపలు, డార్క్ చాక్లెట్ కూడా సామర్థ్యాన్ని పెంచుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news