బిగ్ బాస్ సీజన్ 4 ఆలస్యంగా మొదలైంది. కరోనా కారణం లేటయినా లేటెస్ట్ కంటెంట్ తో ప్రేక్షకులని ఆకర్షిస్తుంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లలో చాలా మందికి జనాల్లో అంత పాపులారిటీ లేకపోయినా, రోజులు గడుస్తున్న కొద్దీ వారి ప్రవర్తనతో షోపై ఆసక్తి కలిగేలా చేస్తున్నారు. అప్పుడే మొదటి ఎలిమినేషన్ పూర్తయిపోయింది. రెండవ ఎలిమినేషన్ కి దగ్గరలో ఉంది. ఐతే ఇప్పుడిప్పుడే అందరినీ ఆకర్షిస్తున్న బిగ్ బాస్, టీఆర్పీల్లో దుమ్ము దులిపింది. మొదటి రోజు ఎపిసోడ్ టీఆర్పీల్లో రికార్డు సృష్టించింది.
బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఏ సీజన్లోనూ మొదటి ఎపిసోడ్ కి రానంత టీఆర్పీని దక్కించుకుంది. 18.7 టీఆర్పీ రేటింగ్స్ తో రికార్డు క్రియేట్ చేసింది. నాగార్జున, తన పూర్వపు రికార్డుని తానే తిరగరాసుకున్నాడు. గత సీజన్లో బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ కి 17. 9రేటింగ్ వచ్చింది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించినపుడు 16.18 వచ్చింది. నాని చేసిన హోస్టింగ్ కే అతి తక్కువ టీఆర్పీ 15.05వచ్చింది. మొత్తానికి సీనియర్ హీరో నాగార్జున తనదైన ఈజ్ తో బిగ్ బాస్ షోని బాగానే లాగిస్తున్నాడు.