ఆ కంటెస్టెంట్లకు మేకప్ వేయండి.. గుర్తుపట్టలేకపోతున్నాం.. నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్..!!

-

సాధారణంగా మేకప్ అంటేనే అమ్మాయి.. అమ్మాయి అంటేనే అందం.. మేకప్ లేకుండా ఏ అమ్మాయి కూడా సహజ ముఖ అందాన్ని చూపించుకోవడానికి సాహసం చేయదు. ఇక చాలామంది మేకప్ వేయనిదే బయట ప్రపంచాన్ని చూడదు అని చెప్పవచ్చు. సాధారణ అమ్మాయిలకే కాదు సెలబ్రిటీల విషయంలో ఈ విషయం బాగా వర్తిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గ్లామర్ ప్రపంచంలో అందంగా కనిపించాలి అంటే ముఖానికి మేకప్ వేయాల్సిందే ఇక మేకప్ వేయని ముఖాలను మేము చూడలేము బాబోయ్ అంటూ నెటిజన్లు సైతం సెటైర్ లు వేస్తున్నారు. అంతేకాదు వారికి మేకప్ వేసి వారెవరో గుర్తుపట్టేలా చేయండి అంటూ బిగ్ బాస్ నిర్వాహకులకు రిక్వెస్ట్ కూడా చేసుకుంటున్నారు..

ఇక అసలు విషయంలోకెళితే బిగ్ బాస్ 6 సెప్టెంబర్ 4వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి రావడం జరిగింది . ఇక బిగ్ బాస్ షో ప్రారంభమై ఇంకా వారం రోజులు కూడా కాకముందే హౌస్ లో లవ్ ట్రాక్స్, గొడవలు , నామినేషన్స్ ,గలాటాలు, తిట్టుకోవడం, గొడవ పడడం ఇలా అన్నీ కూడా మొదలయ్యాయి. ఇక తాజాగా జరిగిన నామినేషన్ లో భాగంగా బాల ఆదిత్య, ఇనయ సుల్తానా, అభినయశ్రీ ఎలిమినేషన్ కు నామినేట్ కాగా.. గీతూ రాయల్ , నేహా చౌదరి , ఆదిరెడ్డి సేవ్ అయ్యారు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో కొంతమంది లేడీ కంటెస్టెంట్ లు మేకప్ లేకుండా కనిపించి అందరికీ షాక్ ఇస్తున్నారు.

ఇక తమ అభిమాన సెలబ్రిటీలను మేకప్లో చూసి..ఇలా వితౌట్ మేకప్ లో చూసేసరికి ఆశ్చర్యపోతున్నారు.ఈక్రమంలోనే కంటెస్టెంట్లపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇక కీర్తిభట్, గీతూ రాయల్, నేహా చౌదరి, ఆరోహీ రావు, ఫైమా లుక్స్ పై విపరీతంగా ట్రోల్స్ వేస్తూ ఉండడం గమనార్హం. ఇక మొదటి రోజు మేము చూసిన వాళ్లేనా వీళ్ళు దయచేసి వాళ్లకు మేకప్ వేసి వారిని గుర్తుపట్టేలా చేయండి అంటూ సెటైర్లు వేస్తున్నారు. దీనిపై బిగ్ బాస్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news