కల్యాణ్​రామ్ యుద్ధం – దుల్కర్ ప్రేమ… ప్రేక్షకులు పట్టం కట్టేదెవరికో?

-

వేసవి సినిమాల సందడి తర్వాత జులై నెల పూర్తిగా నిరాశపరిచింది. గత నెలలో విడుదలైన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుడిని పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో ఆశలన్నీ ఆగస్టుపైనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆగస్టు మొదటి వారంలో బింబిసార, సీతారామం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
హీరో నందమూరి కల్యాణ్​రామ్​ నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘బింబిసార’.​ తొలిసారి ఆ జోనర్​లో కల్యాణ్​రామ్​ నటించిన ఈ సినిమా శుక్రవారం ధియేటర్లలోకి రానుంది. మరోవైపు మలయాళ హీరో దుల్కర్​ సల్మాన్​ నటించిన సీతారామం కూడా శుక్రవారమే రిలీజ్​ కానుంది.

శరణు కోరితే ప్రాణభిక్ష.. ఎదిరిస్తే మరణం’.. ‘శరణు కోరితే ప్రాణ భిక్ష.. ఎదిరిస్తే మరణం’ అంటున్నారు కల్యాణ్‌ రామ్‌. ఆయన కథానాయకుడిగా వశిష్ఠ్‌ తెరకెక్కించిన చిత్రం ‘బింబిసార’. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె నిర్మించారు. సంయుక్తా మేనన్‌, కేథరిన్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా రేపే (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. చరిత్రకు వర్తమానానికి ముడిపెడుతూ సాగే విభిన్నమైన సోషియో ఫాంటసీ చిత్రమిది. ఇందులో కల్యాణ్‌ రామ్‌ బింబిసారుడిగానే కాక మరో స్టైలిష్‌ అవతారంలోనూ కనిపించనున్నారు. కల్యాణ్‌రామ్‌ తొలిసారి ఇలాంటి జోనర్‌లో నటిస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

‘యుద్ధం రాసిన ప్రేమ కథ’.. మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నటించిన ప్రేమకథా చిత్రం ‘సీతా రామం’. మృణాల్​ ఠాకూర్‌ హీరోయిన్​గా నటించిన ఈ సినిమాలో రష్మిక కీలకపాత్రలో నటించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశ్వనీదత్‌, ప్రియాంకదత్‌ నిర్మించారు. ఈ సినిమా కూడా రేపే (శుక్రవారం) ధియేటర్లలోకి రానుంది. ‘చాలా గొప్ప కథ ఇది. ప్రేమకథతో పాటు యుద్ధం లాంటి సంఘర్షణ కనిపిస్తుంది’ అని చిత్ర బృందం చెబుతోంది. ఈ మూవీలో సుమంత్‌, గౌతమ్‌ మేనన్‌, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్​ సినీ అభిమానులను ఆకట్టుకుంది. వెండి తెరపై సీతా-రామ్​ ప్రేమకథ చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news