Big Boss OTT Telugu: సోషల్ మీడియాలో ఫుల్ ప్రమోషన్స్..బిందు మాధవికి పెరుగుతున్న మద్దతు

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీ వర్షన్ గేమ్ ఫైనల్ వీక్ లోకి ఎంటరయింది. ఫైనల్ గా గేమ్ లో ఏడుగురు కంటెస్టెంట్సే ఉన్నారు. పన్నెండో వారంలో గేమ్ పైన ఫుల్ ఫోకస్ పెడుతున్నారు కంటెస్టెంట్స్. గత వారం నటరాజ్ మాస్టర్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

ఈ క్రమంలోనే ఇంటిలో ఉన్న సభ్యులందరూ ‘బిగ్ బాస్’ గేమ్ పైనే ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. కాగా, బిందు మాధవియే టైటిల్ గెలుచుకోవాలని సోషల్ మీడియాలో చాలా మంది కోరుతున్నారు. బిందు మాధవి కి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తు్న్నారు కూడా. #BinduTheSensation హ్యాష్ ట్యాగ్ బిందు ద సెన్సేషన్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్లు కూడా చేస్తున్నారు.

ఇప్పటికే వెర్సటైల్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ బిందు మాధవికి సపోర్ట్ గా ట్వీట్ చేసింది. బిందు మాధవికి ఓటేసి ఆమెను గెలిపించాలని కోరుతూనే..ఆమెనే గెలుస్తుందని జోస్యం చెప్పింది. తాజాగా మరో యంగ్ హీరో బిందు మాధవికి మద్దతు తెలిపారు. హరీశ్ కల్యాణ్ ఈ మేరకు బిందు మాధవికి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశాడు.

ఫైనల్ వీక్ లోకి ఎంటరయిన బిందు మాధవిని చూసి తాను గర్వపడుతున్నాని పేర్కొన్నాడు హరీశ్ కల్యాణ్. బిందు మాధవి టైటిల్ విన్ అవుతుందని జోస్యం చెప్పాడు. సోషల్ మీడియాలో బీబీ లవర్స్ సైతం హల్ చల్ చేస్తున్నారు. అలా మొత్తంగా బిందు మాధవి టైటిల్ గెలుచుకునే చాన్సెస్ మెండుగా కనబడుతున్నాయి. చూడాలి మరి..ఏం జరుగుతుందో..

Read more RELATED
Recommended to you

Latest news