కంటికి కనిపించని శత్రువుతో ఆది సాయికుమార్ యుద్ధం..ఇంట్రెస్టింగ్‌గా ‘బ్లాక్’ ట్రైలర్

-

టాలీవుడ్ సీనియర్ హీరో సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ నటించిన తాజా చిత్రం ‘బ్లాక్’. ఈ ఫిల్మ్ ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఆది నటించిన చిత్రాలు గత కొన్ని రోజులుగా బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడటం లేదు. ఈ నేపథ్యంలోనే ‘బ్లాక్’ మూవీపైన హోప్స్ పెట్టుకున్నారు.

ఈ పిక్చర్ లో ఆది సాయికుమార్..పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. కాగా, ఆయన జీవితంలో జరిగిన ఊహించని ఘటనలను ఎలా ఎదుర్కొన్నాడనేది ఆసక్తికరంగా మలిచినట్లు మేకర్స్ చెప్తున్నారు. ఈ నెల 28న ఫిల్మ్ రిలీజ్ కానుంది.

ట్రైలర్ లో ఆది సాయికుమార్ చెప్తున్న డైలాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నానని పేర్కొన్నాడు హీరో. డెఫినెట్ గా ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తు్న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news