RRR లో బాలీవుడ్ స్టార్..!

-

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరన్నది మరికొద్దిరోజుల్లో ఫైనల్ కానుంది. ఇక మరో పక్క ఈ సినిమాలో విలన్ గా ఓ బాలీవుడ్ స్టార్ నటిస్తాడన్న వార్తలు వస్తున్నాయి.

రాజమౌళి అజయ్ దేవగన్ తో డిస్కస్ చేశాడట అయితే అజయ్ దానికి నో చెప్పడంతో ఆ ఛాన్స్ కాస్త అక్షయ్ కు వెళ్లిందని అంటున్నారు. ఈమధ్య బాలీవుడ్ హీరోలంతా సౌత్ సినిమాల మీద కన్నేశారు. అక్షయ్ కుమార్ ఆల్రెడీ 2.ఓలో విలన్ గా నటించాడు. భారతీయుడు 2లో కూడా అక్షయ్ కుమార్ విలన్ గా చేస్తున్నాడని అంటున్నారు.

ఇప్పుడు రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ ఛాన్స్ కూడా అందుకున్నాడట అక్షయ్ కుమార్. అజయ్ దేవగన్ ఎందుకు వదులుకున్నాడో తెలియదు కాని అక్కి మాత్రం వచ్చిన అవకాశాన్ని వాడుకుంటున్నాడు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందన్నది చిత్రయూనిట్ చెప్పేదాకా తెలియదు.

Read more RELATED
Recommended to you

Latest news