సోషల్ మీడియాలో ప్రస్తుతం బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులను తీవ్రంగా వ్యతిరేకించే వారు వారిని బాయ్‌కాట్ చేస్తూ హ్యాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్ నటి రాధికా ఆప్టే అలాంటి బాయ్ కాట్ బారిన పడింది. బాయ్‌కాట్ రాధికా ఆప్టే పేరిట నెటిజన్లు పెద్ద ఎత్తున ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
రాధికా ఆప్టే 2015లో నటించిన పార్చ్డ్ మూవీ గుర్తుంది కదా. అందులో కొన్ని దృశ్యాల్లో నగ్నంగా నటించింది. ఆ మూవీ భారత్‌లో విడుదల కాకపోయినా ఇంటర్నెట్ మహిమ వల్ల మన దేశంలోనూ దాన్ని చాలా మంది చూశారు. ఈ క్రమంలోనే రాధికా ఆప్టే నటించిన ఆ నగ్న దృశ్యాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఈ విషయం సంచలనంగా మారింది. తరువాత దాని గురించి అందరూ మరిచిపోయారు.
అయితే అప్పటి దృశ్యాలకు చెందిన స్క్రీన్ షాట్లతో కొందరు ఇప్పుడు రాధికా ఆప్టేను బాయ్‌కాట్ చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు. అందులో భాగంగానే ట్విట్టర్లో #BoycottRadhikaApte అనే హ్యాష్ టాగ్ శుక్రవారం నుంచి ట్రెండ్ అవుతోంది.
గతేడాది ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ముంబైలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. నిజానికి సుశాంత్ గొప్ప యాక్టర్. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుశాంత్ ఓవర్ రేటెడ్ యాక్టర్ అని, అతిగా ప్రాధాన్యతను ఇచ్చారని రాధికా ఆప్టే వ్యాఖ్యలు చేసింది. ఇదే ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది. అందుకనే బాయ్‌కాట్ రాధికా ఆప్టే హ్యాష్ ట్యాగ్ ను వారు ట్రెండ్ చేస్తున్నారు. మరి దీనికి రాధికా ఏమని సమాధానం చెబుతుందో చూడాలి.