ఆ హిట్ సినిమాల లాగా నాని కూడా హిట్ కొడతాడా.!

నేచురల్ స్టార్ నాని  హీరోగా నటిస్తున్న దసరా సినిమా  మార్చి నెలలో రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా తో కచ్చితంగా హిట్ కొట్టాలని చాలా కష్టపడుతున్నాడు. ఇక హిట్ కోసం నాని మొత్తం  మమ మాస్ లాగా  తయారు అయ్యాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో లాగా నాని గడ్డం తో చింపిరి జుట్టు పాత లుంగీ నలిగిన చొక్కాతోచాలా మాస్ గా  హడావుడి చేస్తున్నాడు.

సినిమాను ఈ ఏడాది మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా దసరా సినిమా టీజర్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్ రాకతో ఒక్కసారిగా సినిమా పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక టీజర్ చూసిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి తో పాటు మరి కొంత మంది ఈ సినిమా పై ప్రశంశల వర్షం కురిపించారు.

ఇప్పుడు నాని లుక్ పై సినిమా పరిశ్రమ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఇంత మాస్ గా ఉండే హీరో సినిమాలు చాలా వచ్చాయి.రంగస్థలం సినిమా లో రామ్ చరణ్ లుక్ కూడా ఇలాగే ఉంది. అలాగే పుష్ప లో బన్నీ లుక్ కు కూడా అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. అసలు ఇలాంటి సినిమాలు ఆడతాయా అంటూ షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. కాని కట్ చేస్తే  ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.ఆ సినిమాల స్థాయిలోనే దసరా సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అంటూ నాని తో పాటు ఆయన కూడా అభిమానులు నమ్మకంతో ఉన్నారు. చూడాలి మరి నమ్మకం గెలుస్తుందో లేదో.