వారి చేతిలో దెబ్బలు తిన్న చిరంజీవి, నాగబాబు.. కారణం..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. ఇక ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగాస్టార్ నేడు దేశం గర్వించదగ్గర నటుడిగా చలామణి అవుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఎంతోమంది వారసులు ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోలుగా కూడా కొనసాగుతున్నారు అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఏడూరి నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాణ సారథంలో తెరకెక్కిన ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇందుకు ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరవడం జరిగింది.. ఇక ఈ వేదిక పైన తన వ్యక్తిగత, సినిమా సంగతులు చెబుతూ ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలను కూడా రివీల్ చేశారు చిరంజీవి..

ఇకపోతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హోస్టుగా సుమ అదరగొట్టిందని చెప్పవచ్చు.. ఈవెంట్ లో భాగంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవం ఉంటుంది. మరి మీ అనుభవం ఏమిటి? అని చిరంజీవిని ప్రశ్నించగా ఆయన అసలు విషయం తెలిపారు. అప్పట్లో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకొని మరి వివరించారు.. చిరంజీవి మాట్లాడుతూ.. నా జీవితంలో ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవం చాలా దారుణమైనది.. ఇప్పటివరకు ఎక్కడ ఎవరు ముందు చెప్పని ఒక రహస్యం ఇప్పుడు చెబుతాను అంటూ చిరంజీవి తెలియజేయడం ఆ వార్తలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.Chiranjeevi, Nagababu, Pawan kalyan and Nagababu Son Varun Old Memories. | Varun tej, Dp photos, Actor photo

ఇక చిరంజీవి మాట్లాడుతూ .. అది ఏ సంవత్సరమో గుర్తులేదు.. కానీ ఎన్టీఆర్ గారి రాము సినిమా ఫస్ట్ షో చూడాలని వెళ్లి చావు దెబ్బలు తిన్నామని చిరంజీవి వెల్లడించారు. ఇక ఆ సినిమాకు నాతోపాటు నా తమ్ముడు నాగబాబును కూడా తీసుకువెల్లాను. అయితే ఆ సమయంలో నాన్నకు అడ్డంగా దొరికిపోయి దెబ్బలు తిన్నాను అని చిరంజీవి తెలిపారు. నాన్నగారు ఎప్పుడు సినిమాకు తీసుకెళ్లినా కుర్చీ టికెట్ కే తీసుకెళ్లేవారు. అయితే ఎన్టీఆర్ నటించిన రాము సినిమా కోసం మేము మాత్రం నేల టికెట్ తీసుకొని సినిమా హాల్లోకి వెళ్ళిపోతుండగా అప్పటికే షో ముగియడంతో అమ్మ నాన్న ఆ సినిమా చూసి బయటకు వస్తూ మమ్మల్ని చూసారు..

 

ఇంకేముంది నాగబాబు బిక్క మొఖం వేసుకోవడం.. వాడికి ఒళ్లంతా చెమటలు పట్టడం.. ఇంక మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి.. నాన్న కొబ్బరిమట్ట తీసుకొని మరి చితకబాదారు.. రోడ్ మీద ఉరికించి కొట్టారు. అంత చిన్న వాడిని తీసుకొని సినిమాకు వెళ్లి.. పైగా నేల టికెట్ తీసుకోవడం ఏంటి? వాడిని తొక్కేస్తే ఎలా అంటూ నాపై కోప్పడ్డారు అని చిరంజీవి తెలిపారు. ఇక అదే నా ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ అంటూ వెల్లడించారు చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news