ఆ హీరోయిన్స్‌తో చిరంజీవి అరుదైన రికార్డు.. అదేమిటంటే?

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి త్వరలో ‘గాడ్ ఫాదర్’గా ప్రేక్షకులను పలకరించనున్నారు. గత చిత్రం ‘ఆచార్య’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో ‘గాడ్ ఫాదర్’ ఫిల్మ్ పైన మెగా ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే..చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో రికార్డులు సృష్టించారు. కాగా, ఆ ముగ్గురు హీరోయిన్స్ తో మాత్రం చిరు..ఓ అరుదైన ఫీట్ చేశారు. ఆ హీరోయిన్స్ ఎవరంటే..

అక్కా చెల్లెళ్లు అయిన ముగ్గురు హీరోయిన్స్ తో సినిమాలు చేసి మెగాస్టార్ చిరంజీవి తన ఖాతాలో ఓ అరుదైన రికార్డు వేసుకున్నారు. ఈ రికార్డు తెలుగులో మరే హీరోకు సొంతం కాలేదు. చిరంజీవి ప్రస్తుతం కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న క్రమంలోనే ‘భోళా శంకర్’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాల షూటింగ్స్ చేస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమాకు రెడీ అయిపోతున్నారు.

ఇక చిరంజీవి అరుదైన ఫీట్ విషయానికొస్తే.. హీరోయిన్స్ అయిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు నగ్మా, రోషిణి, జ్యోతిక..ల సరసన చిరు హీరోగా నటించారు.

నగ్మా సోదరి జ్యోతికతో రికార్డులను తిరగరాసిన ‘ఠాగూర్’ సినిమాలో నటించారు చిరు. ఇక నగ్మా మరో సోదరి రోషిణితో చిరు..‘మాస్టర్’ సినిమాలో నటించారు. ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరోయిన్ రోషిణి కనబడుతుంది.

నగ్మాతో ‘ఘరానా మొగుడు’ చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ ఒక్క చిత్రమే కాదు ఈ ముగ్గురు హీరోయిన్స్ తో చిరు కలిసి నటించిన చిత్రాలన్నీ కూడా ఘన విజయం సాధించడం విశేషమని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news