గౌతమ్ రాజు మృతి పై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కరోనా అలాగే ఇతర కారణాల వల్ల చాలామంది ప్రముఖ నటులు తుది శ్వాస  విడిచారు. ఈ నేపథ్యంలోనే…తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర చోటు చేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు మరణించారు.68 సంవత్సరాల గౌతమ్ రాజు నిన్న రాత్రి మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎడిటర్ గౌతమ్ రాజు అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయారు.

తెలుగు, తమిళం అలాగే కన్నడ భాషల్లో సుమారు 800 సినిమాలకు గౌతమ్ రాజు ఎడిటర్ గా పనిచేశారు. తెలుగులో ఖైదీ 150, బలుపు, ఊసరవెల్లి, డాన్ శీను, డిటెక్టర్, గబ్బర్ సింగ్, కిక్, బద్రీనాథ్, రేసుగుర్రం, సౌఖ్యం, అదుర్స్ మరియు గోపాల గోపాల లాంటి సినిమాలకు గౌతమ్ రాజు ఎడిటర్ గా పనిచేశారు. ఇక గౌతమ్ రాజు మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి గౌతంరాజు మృతిపై సంతాపం తెలుపుతూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.” గౌతమ్ రాజు లాంటి గొప్ప ఎడిటర్ ని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన ఎంత సౌమ్యుడో వారి ఎడిటింగ్ అంత వాడి. ఆయన మితభాషి, కానీ ఆయన ఎడిటింగ్ మెలకువలు అపరిమితం. ఎంత నెమ్మదస్తుడో, ఆయన ఎడిటింగ్ అంత వేగం. నా “చట్టానికి కళ్ళు లేవు” సినిమా నుంచి “ఖైదీ నెంబర్ 150″ వరకు ఎన్నో చిత్రాలకు వర్క్ చేశారు. గౌతమ్ రాజు మరణం వ్యక్తిగతంగా నాకు, చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.” అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news