కోబ్రా ట్రైలర్.. లెక్కల మాస్టార్ ఆట మామూలుగా లేదుగా !

-

కోలీవుడ్ స్టార్ హీరో ‘చియాన్’ విక్రమ్..నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరైన పాత్ర దొరికితే తనలోని నట విశ్వరూపం చూపించేస్తారు ఈ వెర్సటైల్ యాక్టర్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’. మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ ట్రైలర్‌ ను గమనిస్తే.. విక్రమ్‌ ను విలన్‌ గ్యాంగ్‌ చిత్ర హింసలు పెట్టే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఇందులో హీరో విక్రమ్‌ విభిన్న పాత్రల్లో కనిపిస్తారు. ఆయన పోషించిన విభిన్న పాత్రలు ఒక్కక్కటి రివీల్‌ అవుతూ.. సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.

ప్రతి లుక్‌ ను మార్కును చూపించారు విక్రమ్‌. ఇందులో ఆయన గణిత శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. 7 స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని, రవి, కె.ఎస్ రవికుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ముఖ్యపాత్రలో సందడి చేయనున్నారు. కాగా.. ఈ సినిమా ఈ నెల 31న రిలీజ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news