సినిమా కార్మికుల కోసం చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఆస్పత్రి నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వం సినీ కార్మికుల వెంటే ఉంటుందని.. చిరంజీవి గారు పెద్ద ఆస్పత్రి కట్టాలనే సంకల్పంతో ఉన్నారన్నారు. చిత్రపురిలోని పాఠశాలు, ఆస్పత్రికి కావల్సిన స్థలం ఉందని.. చిరంజీవి గారు చిత్రపురి స్థలంలో ఆస్పత్రి నిర్మిస్తే కొన్ని వేల మంది కార్మికులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
మే డే వచ్చిదంటే యావత్ ప్రపంచమంతా కార్మిక దినోత్సవం జరుపుకుంటుందని… 24 విభాగాలకు సంబంధించిన లక్షలాది మంది కార్మికులు రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి సినీ కార్మికులదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తోందని… తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారన్నారు. ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలన్నది చిరంజీవి ఆకాంక్ష అని… చిరంజీవి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు.