నందమూరి బాలకృష్ణకు ‘బాలయ్య’ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా?

-

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలయ్య..ప్రజెంట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 ఫిల్మ్ చేస్తున్నారు. దీని తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తన 108వ సినిమా చేయనున్నారు బాలకృష్ణ. సీనియర్ ఎన్టీఆర్ నట వారసత్వాన్ని మాత్రమే కాదు రాజకీయ వారసత్వాన్ని కూడా బాలయ్య కొనసాగిస్తున్నారు.

హిందూపూర్ ఎమ్మెల్యేగా, సినీ నటుడిగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను అలరిస్తున్నారు. బాలయ్య వెండితెర మీద కనబడితే చాలు..అభిమానులు హ్యాపీగా ఫీలవుతుంటారు. ఇటీవల విడుదలైన ‘అఖండ’ పిక్చర్ ఘన విజయం సాధించింది. ఆ ఊపులోనే బాలయ్య తర్వాత చిత్రాలపైన ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. కాగా, బాలయ్యను తొలుత సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ అనియే సంబోధించేవారు. కానీ, కాలక్రమేణా ఆయన పేరు ‘బాలయ్య’గా మారింది. అలా పేరు మారడం వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరి ఉంది. అదేంటో తెలుసుకుందాం.

యాక్షన్ సీక్వెన్సెస్ చేయడంలో బాలయ్య ఎప్పుడూ ముందుంటారు. ఓ వైపున పౌరాణికం, సాంఘీకం, జానపదం చేస్తూనే పవర్ ఫుల్ ఫైట్ సీక్వెన్సెస్ చేయడానికి సై అంటుంటారు. అలా ఆయన కెరీర్ లో బాలయ్య చాలా ప్రయోగాలు చేశారు. టాలీవుడ్ సీనియర్ యాక్షన్ డైరెక్టర్ బి.గోపాల్ -బాలయ్య కాంబోలో వచ్చిన చిత్రాలు ఘన విజయం సాధించాయి. అలా వారి కాంబోలో వచ్చిన చిత్రం ‘లారీ డ్రైవర్’.

Balakrishna
Balakrishna

ఈ పిక్చర్ షూటింగ్ సమయంలో బి.గోపాల్ ..చిత్ర గీత రచయిత జొన్నవిత్తులకు ఓ సలహా ఇచ్చారట. అదేంటంటే..పాటలో ‘జై బాలయ్య’ అని రావాలని సూచించారు. దాంతో జొన్న విత్తుల ‘బాలయ్య..బాలయ్యా..గుండెల్లో గోలయ్యా’ అనే పదాలు రాశారు. అలా అభిమానులందరూ అప్పటి నుంచి ‘బాలయ్య’ అని పిలవడం స్టార్ట్ చేశారు. అలా ‘బాలయ్య’ పేరు సినీ లవర్స్, ఇండస్ట్రీ వ్యక్తులతో పాటు ప్రతీ ఒక్కరికి నోట్ అయిపోయింది. గోపీచంద్ మలినేని-బాలయ్య సినిమాకు ‘జై బాలయ్య’ అనే టైటిల్ ఫైనల్ అయినట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.

Read more RELATED
Recommended to you

Latest news