పొన్నియన్ సెల్వన్ సినిమా ఎన్నిసార్లు ఆగిపోయిందో తెలుసా..?

-

డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పోన్నియన్ సెల్వన్. ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో విడుదల అయ్యింది. ఈ చిత్రంలో నటీనటుల విషయానికి వస్తే జయం రవి, కార్తీ, త్రిష ,ఐశ్వర్యారాయ్, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ ,విక్రమ్ ప్రభు తదితర నటీనటులు నటించారు. ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. అయితే ఈ చిత్రాన్ని గతంలో ఎంతోమంది తెరకెక్కించారని పలు ప్రయత్నాలు చేశారట వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Kamal Haasan opens up on his bond with MGR! - Tamil News ...

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డైరెక్టర్ అయిన ఎన్జీ రామచంద్రన్ కూడా (MGR) ఈ నవలను సినిమాగా తీయాలనుకున్నారట. 1958లో ఈ సినిమాని తీయబోతున్నట్లు ఒకసారి ప్రకటించడం జరిగిందట. అయితే ఇందులో సావిత్రి, జెమినీ గణేష్, సరోజా దేవి, బాలయ్య కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఈ చిత్రం మాత్రం పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఈ నవలను సినిమా రూపంలో తీయడానికి హీరో కమలహాసన్ కూడా ఎన్నోసార్లు ప్రయత్నించారట కానీ అది మాత్రం జరగలేకపోయిందని సమాచారం.

ఇక తర్వాత ఈ నవలను సినిమాగా తీయడం తన డ్రీమ్ ప్రాజెక్టు అన్నట్లుగా డైరెక్టర్ మణిరత్న 1990లో ఒకసారి ప్రకటించారు. ఆ తరువాత అనేకసార్లు దీని గురించి మాట్లాడిన కానీ అందుకు సంబంధించి ప్రయత్నాలు చేసిన ఫలించలేకపోయాయి.. కానీ చివరిగా 2019వ సంవత్సరంలో లైకా ప్రొడక్షన్ వారు ఈ సినిమాని నిర్మిస్తామని మణిరత్నంతో తెలియజేశారట. దీంతో ఈ సినిమా లైక ప్రొడక్షన్ వారు తెరకెక్కించారు. రూ.500 కోట్ల రూపాయల ఖర్చు చేసి తెరకెక్కించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఏ సినిమా సెకండ్ పార్ట్ గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నది.

Read more RELATED
Recommended to you

Latest news